Switch to English

వైసీపీ కంటే టీడీపీతోనే జనసేనకు ప్రమాదమెక్కువా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. బద్వేలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే, టీడీపీ.. తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బద్వేలు ఉప ఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి పోటీ చేస్తున్న దరిమిలా, తాము ఆమెపై తమ అభ్యర్థిని నిలబెట్టబోమన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన సారాంశం.

ఈ ప్రకటనతో జనసేన మిత్రపక్షమైన బీజేపీ విభేదించిందనుకోండి.. అది వేరే సంగతి. అయితే, పోటీలోకి దిగిన టీడీపీ, అనూహ్యంగా ఎందుకు బరిలోంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు.? ఇదే ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

పవన్ కళ్యాణ్ బాటలో చంద్రబాబు.. అన్న చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సూచన మేరకే పవన్ కళ్యాణ్, బద్వేలు ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకున్నారనీ, ఆ వెంటనే చంద్రబాబూ తమ నిర్ణయాన్ని ప్రకటించారనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఇలాగే వుంటాయి. జనసేనను చంపేయడానికి ఏ అవకాశాన్నీ చంద్రబాబు వదులుకోరు. 2019 ఎన్నికల్లో కొందరు టీడీపీ అభ్యర్థులు, ‘జనసేన మాకు మిత్రపక్షమే.. మాకు ఓటేసి గెలిపించండి..’ అంటూ గ్రామ స్థాయిలో ప్రచారం చేసుకున్నారు.. టీడీపీ – జనసేన మధ్య పొత్తు లేకపోయినా. అలా జనసేనను దెబ్బ తీయడంలో టీడీపీ అప్పట్లో గొప్పగానే వ్యూహాలు రచించేసింది, కొంతమేర సక్సెస్ అయ్యింది కూడా.

అయితే, జనసేనని దెబ్బ తీయడమే కాదు, 2019 ఎన్నికల్లో టీడీపీ కూడా ఈ చెత్త వ్యూహాల కారణంగానే దెబ్బ తినేయాల్సి వచ్చింది. మళ్ళీ అదే వ్యూహం.. మళ్ళీ మళ్ళీ అదే తప్పిదం.. మళ్ళీ మళ్ళీ మళ్ళీ.. జనసేన మీద టీడీపీ అదే తరహా విష ప్రచారం చేస్తూనే వుంది. బద్వేలు ఉప ఎన్నిక సాక్షిగా చంద్రబాబు కుటిల రాజకీయం బయటపడింది.

నిజానికి, ప్రధాన ప్రతిపక్షం గనుక, టీడీపీనే.. అందరికంటే ముందు.. పోటీలో వుండకూడదన్న నిర్ణయం తీసుకుని వుండాలి. లేదంటే, బరిలోకి దిగడానికే కట్టుబడి వుండాలి. కానీ, జనసేన అధినేత నిర్ణయం వచ్చాక, టీడీపీ కూడా అదే నిర్ణయం తీసుకోవడం, జనసేనను దెబ్బ తీయడానికి కాకపోతే ఇంకేంటి.? పరోక్షంగా వైసీపీకి అయినా మేలు చేయొచ్చుగానీ, జనసేనను దెబ్బ తీయడం.. తద్వారా తాను దెబ్బ తినడం.. అనే వ్యూహాల్ని మాత్రం చంద్రబాబు మానుకోవడంలేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...