Switch to English

పాపం తమ్మినేని.. ‘గొంతు’ నొక్కేశారెందుకని!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంతవరకు పవర్‌ ఫుల్‌ పొలిటికల్‌ లీడర్స్‌ లిస్ట్‌ తీస్తే, అందులో తమ్మినేని సీతారాం పేరు కూడా ఖచ్చితంగా వుంటుంది. ఒకానొక టైమ్‌లో ఆయన యూత్‌ ఐకాన్‌గా చిక్కోలులో బోల్డంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించారు. ఇప్పుడంటే ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత.. అని ప్రచారంలోకి వస్తున్నారుగానీ, గతంలో ఆయన చుట్టూ అస్సలేమాత్రం సామాజిక వర్గం తాలూకు ప్రభావం వుండేది కాదు.

టీడీపీలో వున్నప్పుడు తమ్మినేని సీతారాం, కింజరాపు ఎర్రన్నాయుడు మధ్య ఆధిపత్య పోరు నడిచేది. అయితే, రాజకీయంగా వేసిన కొన్ని తప్పడగులు తమ్మినేని సీతారాం ఇమేజ్‌ని రాజకీయాల్లో బాగా తగ్గించేశాయన్నది నిర్వివాదాంశం. మళ్ళీ ఇన్నేళ్ళకు తమ్మినేని సీతారాం పేరు తెలుగునాట మార్మోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం పేరుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఖరారు చేశారు.

అయితే, తమ్మినేని అభిమానులు మాత్రం తమ అభిమాన నేతకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. కారణం, తమ్మినేని సీతారాంకి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందనీ, అది కూడా కీలక పదవి దక్కుతుందని వారు ఆశించడమే. ఉప ముఖ్యమంత్రి అవ్వగల స్టామినా వున్న తమ్మినేని సీతారాంను స్పీకర్‌ పదవిలో కూర్చోబెట్టడం ద్వారా ఆయన గొంతు నొక్కేశారనే భావన చాలామందిలో విన్పిస్తోంది. స్పీకర్‌ అంటే, ఇకపై రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి వస్తుంది.

చంద్రబాబు హయాంలో స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాద్‌ మాత్రమే ఒకింత భిన్నంగా వ్యవహరించారు. ఫక్తు టీడీపీ నేతగా ఆయన వ్యవహరించేవారు. రాజకీయ విమర్శలు చేయడం ద్వారా స్పీకర్‌ పదవికి కళం తెచ్చారనీ, ఆ కారణంగానే ఆయన తాజా ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందంటారు చాలామంది. వైఎస్‌ జగన్‌ హయాంలో ఆ పరిస్థితి స్పీకర్‌కి వుండకపోవచ్చు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించకూడదని వైఎస్‌ జగన్‌ నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో స్పీకర్‌ పదవిలో తమ్మినేని సీతారాం, తన ఎగ్రెసివ్‌ నేచర్‌కి భిన్నంగా వ్యవహరించి తీరాల్సిందే. అన్నట్టు, స్పీకర్‌ పదవిలో కూర్చున్నవారు ఆ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమనే సెంటిమెంట్‌ ఒకటి బలంగా వుంది. దాంతో, తమ్మినేని అభిమానులు తమ అభిమాన నేతని ఇలా దెబ్బకొట్టారంటూ చర్చించుకుంటుండడం గమనార్హం. స్పీకర్‌ పదవిని దాదాపు చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు వద్దనుకున్నాక, చివరికి తమ్మినేని సీతారాంకి వైఎస్‌ జగన్‌ అంటగట్టారన్న ప్రచారమూ లేకపోలేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...