Switch to English

జనసేన అమ్ములపొదిలో మరో ‘అస్త్రం’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,388FansLike
57,764FollowersFollow

రాజకీయ రంగంలో సరికొత్త మార్పు కోసం సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించి జనంలోకి వెళ్ళిన విషయం విదితమే. 2014లో ప్రారంభమైన జనసేన పార్టీ, ఇటీవలి ఎన్నికల్లో ఆశించిన రీతిలో ఫలితాలు సాధించలేకపోయినా, డబ్బుతో సంబంధం లేకుండా రాజకీయాలు చేయవచ్చునని నిరూపించింది. మార్పు కోసం పాతికేళ్ళ పోరాటం.. అనే అద్భుతమైన ఎజెండా పెట్టుకున్న జనసేన పార్టీ, రానున్న రోజుల్లో పార్టీ పని తీరు ఎలా వుండాలన్నదానిపై పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించింది.

పవన్‌కళ్యాణ్‌ నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో పార్టీ కోసం ఓ పత్రిక ఖచ్చితంగా వుండాలనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. వాస్తవానికి ఈ ఆలోచన గత కొన్నేళ్ళుగా జనసేనలో విన్పిస్తూనే వుంది. జనసేన తరఫున పక్ష పత్రిక ప్రారంభించనున్నట్లు తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేత హరిప్రసాద్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకురావడం, ప్రస్తుత రాజకీయాలపై మేధావులు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు, దేశ విదేశాలకు సంబంధించిన పాలసీ నిర్ణయాలు, సంక్షేమం – అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఈ పత్రికలో ప్రచురితమవుతాయి. సెప్టెంబర్‌లో తొలి పత్రిక రాబోతోంది. ప్రింట్‌ వెర్షన్‌ అలాగే, ఈ-వెర్షన్‌ పత్రిక కూడా అందుబాటులో వుంటుంది.

మరోపక్క, ఇటీవలి ఎన్నికలు – ఫలితాల గురించి పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ రోజు పలు జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు, అభ్యర్థులతో స్వయంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మాట్లాడారు. ఈ సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు, నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాగబాబు కూడా పాల్గొన్నారు. ఇదిలా వుంటే, పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తోన్న కార్యకర్తలు, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌ విషయంలో నాగబాబు ఇకపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అభిమానుల్ని పార్టీ కార్యకర్తలుగా, జనసైనికులుగా మలచే బాధ్యతను నాగబాబుపై పవన్‌కళ్యాణ్‌ వుంచారని సమాచారమ్‌. వీలు చిక్కినప్పుడల్లా రాష్ట్రమంతటా పర్యటించి, అభిమానులతో నాగబాబు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తారట. అదే విధంగా తెలంగాణలోనూ పార్టీ విస్తరణపై అంతర్గతంగా పార్టీలో చర్చ జరుగుతోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ...

Pawan : అకీరా ఎంట్రీ ఇవ్వాల్సిన టైమ్‌ వచ్చినట్లే..!

Pawan : పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటూ చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితమే...

Ramoji Rao : సినీ నిర్మాతగా రామోజీరావు…!

Ramoji Rao : 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన రామోజీరావు తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారు. తెలుగు పదం ఉన్నంత కాలం...

Balakrishna : బాలయ్యకి మంత్రి పదవి… మరి సినిమాలు?

Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుసగా మూడవ సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా గాలి బలంగా వీచినా కూడా...

Chiranjeevi: అరుదైన కలయిక.. 34ఏళ్ళ తర్వాత చిరంజీవిని కలిసిన నాటి బాలనటులు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటి జగదేకవీరుడు అతిలోక సుందరి. సినిమాలో చిరంజీవి-శ్రీదేవి జోడీ...

రాజకీయం

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్...

Balakrishna : బాలయ్యకి మంత్రి పదవి… మరి సినిమాలు?

Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుసగా మూడవ సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా గాలి బలంగా వీచినా కూడా తట్టుకుని నిలబడ్డ బాలకృష్ణ ఈసారి కూడా...

Kamal Haasan: ‘గర్వంగా ఉంది బ్రదర్’.. పవన్ కల్యాణ్ కు కమల్ హాసన్ విషెష్

Kamal Haasan: ఏపీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అద్వితీయమైన విజయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్నికల్లో ఆయన...

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 12 వ తేదీ ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం...

పవన్ తల్లికి తగ్గ కొడుకు.. అనా భర్తకు తగ్గ భార్య

ప్రతి మగాడి విజయం వెనకా ఒక ఆడది ఉంటుందంటారు. అది తల్లి రూపంలో అయినా సరే..భార్య రూపంలో అయినా సరే. మరే రూపంలో అయినా సరే. ఏ మనిషికైనా గట్టి సపోర్టింగ్ సిస్టం...

ఎక్కువ చదివినవి

కర్కశం అయిన తీర్పు

ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రజలు అందరు కసిగా కోపంగా ఒక ఉత్తుంగ తరంగం లా, ఒక ప్రచండ మారుతంలా ముంచేశారు వైస్సార్సీపీ ని. ఏ 'I-PAC' కి, ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ కి అందని.....

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

కూటమి విజయం… టాలీవుడ్ కష్టం తీరినట్టేనా!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో జోష్ నెలకొంది. అంతేకాకుండా టాలీవుడ్ లోనూ కూటమి విజయాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. గత...

‘ ఈనాడు ‘ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

' ఈనాడు' సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈనెల 5న మరోసారి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు....

కేకే సర్వేస్.. ఎవరు బ్రో నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్!

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావిడి పూర్తయింది. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో తెలుగుదేశం- జనసేన-భారతీయ జనతా పార్టీ కూటమి సాలిడ్ విజయం సాధించింది. అధికార వైఎస్ఆర్సిపి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. సార్వత్రిక...