Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటి జగదేకవీరుడు అతిలోక సుందరి. సినిమాలో చిరంజీవి-శ్రీదేవి జోడీ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. వీరితోపాటు బాలనటులుగా షాలిని, షామిలి, రిషి, అమిత్ సినిమాలో కీలకం. వీరిలో షాలిని, షామిలి, రిషి తోబుట్టువులు. బాలనటులుగా చిరంజీవి వీరితో పంచిన వినోదం అప్పట్లో చిన్న పిల్లలను విపరీతంగా ఆకర్షించింది.
34ఏళ్ల తర్వాత.. ఇటివల హైదరాబాద్ లో వీరు ముగ్గురూ చిరంజీవిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. వీరంతా కలుసుకున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాలో చిరంజీవితో ఉన్న పిక్.. ప్రస్తుతం ఫొటోను జత చేసి అభిమానులు ముచ్చటపడుతున్నారు. ఈమేరకు చిరంజీవిని కలుసుకున్న తమ సంతోషాన్ని షాలిని ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక క్లాసిక్ మూవీగా నిలిచిన సినిమా. 1990 మే9న విడుదలైన సినిమాపై తుపాను ప్రభావం తీవ్రంగా పడినా ప్రేక్షకులు ఏమాత్రం లెక్క చేయకుండా ఆదరించడం ఓ చరిత్ర.