Switch to English

కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు: బ్లేమ్ గేమ్.. షేమ్ గేమ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానిది మొండి వైఖరి.. అంటూ రాష్ట్రాలు దుమ్మెత్తి పోశాయి. ప్రధాని మోడీని గట్టిగా తిట్టగలిగినవారు తిట్టేశారు.. తిట్టలేనివారు మాత్రం సుతిమెత్తగా సన్నాయి నొక్కులు నొక్కారు. కేంద్రమేమో, వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రాలు బాధ్యతగా వ్యవహరించలేదంటూ ఆరోపించి చేతులు దులుపుకుంది.

అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు.. ఎవరైతేనేం, పాలకులు ప్రజల్ని కరోనా మహమ్మారికి బలి చేసేశారన్నది నిర్వివాదాంశం. ఇపుడు సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి బ్లేమ్ గేమ్ అటకెక్కి.. ఇప్పుడు షేమ్ గేమ్ షురూ అయ్యింది. దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ కేంద్రమే చేస్తుందని నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించాక, ‘ఆ ఘనత మాదే..’ అని చెప్పుకుంటున్నాయి ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వింత వైఖరి మరీ దారుణంగా తయారైంది.

‘మెడలు వంచడం అంటే ఇదే..’ అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా గొప్పల డప్పా కొట్టుకుంటున్నాయి. తెలంగాణలో గులాబీ శ్రేణులు కూడా తమ పార్టీ గొప్పతనం గురించి నిస్సిగ్గుగా చెప్పేసుకుంటున్నాయి. నిజానికి, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, అధికారికంగా కేంద్రంపై మండిపడిన సందర్భాల్లేవు. కేంద్రాన్ని నిలదీసిన పరిస్థితి అసలే లేదు.

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే, కేంద్రాన్ని నిలదీసిన ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కి క్లాస్ తీసుకున్నారు.. సుద్దులు చెప్పేందుకు ప్రయత్నించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కేంద్రం, ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ విషయంలో దిగివచ్చిందంటే, దానిక్కారణం సర్వోన్నత న్యాయస్థానం. వ్యాక్సినేషన్ ప్రక్రియ విషయమై పదే పదే కేంద్రం తీరుని తప్పు పడుతూ వచ్చింది సుప్రీంకోర్టు. వ్యాక్సినేషన్ విధానం అస్సలు బాగా లేదనీ, వ్యాక్సినేషన్ దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా చేయాలనీ సుప్రీంకోర్టు చాలా సార్లు అభిప్రాయపడింది, కేంద్రం తీరుపై మండిపడింది.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ మెట్టు దిగక తప్పని పరిస్థితి. దీన్ని తమ ఘనతగా చెప్పుకునేందుకు బులుగు కార్మికులు, గులాబీ కార్మికులు తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న పాట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...