Switch to English

మోడీపై గొంతు చించుకుంటున్న రాహుల్ గాంధీ.. ఉపయోగమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చెవిటోడి ముందు శంఖం ఊదితే ప్రయోజనమేంటి.? అంటూ బీజేపీ పాలనపై దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజలూ విమర్శలు చేస్తున్నారు. దానిక్కారణం, కరోనా పాండమిక్ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ సర్కార్ చేతులెత్తేయడమే. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మీద పెట్టిన ఫోకస్‌లో పదో వంతు ఫోకస్, కరోనా వైరస్ మీద పెట్టినా, దేశానికి ఇప్పుడీ దుస్థితి వచ్చి వుండేది కాదన్నది మెజార్టీ ప్రజల అభిప్రాయం. ఇందులో నిజం లేకపోలేదు కూడా.

కరోనా సెకెండ్ వేవ్‌కి సంబంధించి ప్రపంచంలో వివిధ దేశాలు తాము ఆ బాధను అనుభవిస్తూ, ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఆ హెచ్చరికల్ని మోడీ సర్కార్ లైట్ తీసుకుంది. దేశ ప్రజల్ని అప్రమత్తం చేయడంలో విఫలమైంది. ఫలితం చూస్తున్నాం కదా.. దేశంలో ఆక్సిజన్ కొరత, మందుల కొరత. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 4 వేలకు పైగా ప్రాణాలు పోతున్నాయ్.. కరోనా నేపథ్యంలో. ఇవి అధికారిక మరణాలు. స్మశానాల వద్ద నిఘా పెడితే, ఈ సంఖ్య రెట్టింపే వుంటుందో.. పది రెట్లు వుంటుందో అంచనా వెయ్యడానికీ భయపడే పరిస్థితి.

ఇదిలా వుంటే, ప్రధాని నరేంద్ర మోడీపై తూటాల్లాంటి విమర్శలు పేల్చుతున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో ఆక్సిజన్ దొరకట్లేదు.. మందులు దొరకట్లేదు.. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఆచూకీ కూడా దొరకట్లేదంటూ తాజాగా ఓ సెటైర్ పేల్చారు రాహుల్ గాంధీ. ఇదేదో ఉత్త విమర్శ కాదు. విషయం వున్న విమర్శే. మొదటి వేవ్ సందర్భంగా ఇంటి బయటకొచ్చి కంచాలు, గరిటెలు పట్టుకుని బాదమన్నారు.. క్లాప్స్ కొట్టమన్నారు.. గంట కొట్టమన్నారు.. కొవ్వొత్తులు వెలిగించమన్నారు. కానీ, చివరికి కేంద్రం చేసిందేంటి.? ప్రజలకు ఏమీ చేయలేదు.

రెండో వేవ్‌లో పరిస్థితి మరీ దారుణం. లాక్ డౌన్ కూడా ప్రకటించలేకపోయింది కేంద్రం. మారటోరియం లేదు.. ఇంకేమీ లేదు. వ్యాక్సిన్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతోంది కేంద్రం. ఈ విషయమై కాంగ్రెస్ పోరాటాన్ని అభినందించాల్సిందే. కానీ, ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీకి ఎంత లాభం.? కాంగ్రెస్ గొంతు నొక్కేయడం మోడీకి చిటికె వేసినంత పని.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...