Switch to English

వైసీపీ అభ్యర్థి క్రైస్తవుడు: ప్రకటించేసిన బీజేపీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఇప్పుడున్న రాజకీయాల్లో కుల, మత, ప్రాంత ప్రస్తావన వుండకూడదనుకుంటే అంతకన్నా పెద్ద బూతు ఇంకొకటుండదు. రాజకీయాలు నడుస్తున్నదే కులాల పునాదుల మీద.. మతాల ప్రాతిపదికన.. ప్రాంతాల సెంటిమెంట్లతో. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే నిష్టుర సత్యం.

తిరుపతి ఉప ఎన్నిక వేళ భారతీయ జనతా పార్టీ హిందుత్వ అజెండాని పాటించడం సంగతెలా వున్నా, ‘క్రైస్తవ వ్యతిరేక’ అజెండా మాత్రం గట్టిగా పట్టుకుంది. ‘వైసీపీ అభ్యర్థి క్రైస్తవుడు. దళితులకు అన్యాయం చేసి వారికి కేటాయించిన స్థానంలో నిలబడి వారి హక్కులను కాలరాస్తున్న వ్యక్తికి ఓటు వెయ్యాలా.? విశ్వ నగరమైగా పేరు గాంచిన పవిత్రమైన తిరుపతికి ఒక క్రైస్తవుడు ఎంపీ కావడం ఊహించగలమా.?’ అని ప్రశ్నిస్తూ, బీజేపీ అధికారిక ట్విట్టర్ ద్వారా వైసీపీ అభ్యర్థి విషయంలో తీవ్రమైన ప్రశ్న సంధించింది.

ఓ చర్చి పాస్టర్ దగ్గర వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆశీస్సులు తీసుకుంటున్న ఫొటో దానికి జత చేసింది. అయితే, బీజేపీ ప్రశ్నపై ఎదురుదాడి చేస్తూ, వైసీపీ మద్దతుదారులు.. గతంలో పాస్టర్ల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు తీసుకున్నదానికి సంబంధించిన ఫొటోని చూపిస్తున్నారు. ఇది బీజేపీ – వైసీపీ మద్య వైరంలా లేదు.. వైసీపీకి మేలు చేయడానికే ఈ పనికిమాలిన అజెండాని బీజేపీ నెత్తినేసుకున్నట్టుంది.

క్రైస్తవ సమాజం మొత్తాన్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, వైసీపీకి అనుకూలంగా ఓటేయించాలన్న తపనే బీజేపీ విమర్శల్లో కనిపిస్తోంది. ‘నువ్వు కొట్టినట్లు నటించు.. నేను ఏడ్చినట్లు నటిస్తాను..’ అన్నట్టుంది బీజేపీ, వైసీపీ వ్యవహారం. ఈ రెండు పార్టీల మధ్యా బీజేపీ మిత్రపక్షమైన జనసేన నలిగిపోతోంది. అందుకేనేమో, జనసైనికులు.. ఈ చెత్త యుద్ధానికి చాలా దూరంగా వుంటున్నారు.

క్రైస్తవ మతంలోకి దళితులు మారినప్పటికీ, దళిత ట్యాగ్ వదులుకోకపోవడం, దళిత రిజర్వేషన్లు పొందుతుండడం ద్వారా అసలు సిసలు దళితులకు రిజర్వేషన్ల ఫలాలు అందడంలేదన్నది బీజేపీ ఆరోపణ. ఈ ఆరోపణ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి వుంటే, దేశవ్యాప్తంగా అలాంటివారి లిస్టు తీసుకొచ్చి.. ఏనాడో అసలు సిసలు దళితులకు న్యాయం చేసేదే.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...