Switch to English

‘వకీల్ సాబ్’ వివాదంపై తెలుగు సినీ పెద్దల మౌనమెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

‘80 కోట్లు రెమ్యునరేషన్ దొబ్బుతున్నారు..’ అంటూ సాక్షాత్తూ ఆంధ్రపదేశ్ రాష్ట్ర మంత్రి ఒకరు వివాదాస్పద రీతిలో, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తే.. ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు సినీ పరిశ్రమ నుంచి స్పందించలేకపోయారు. ‘రెమ్యునరేషన్ తగ్గించుకోండి.. అప్పుడు తక్కువ టిక్కెట్ ధరతోనే సినిమాలకు లాభాలు వస్తాయి..’ అని సదరు మంత్రిగారు సినీ పరిశ్రమకు ఉచిత సలహా ఇచ్చేశారాయె.

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాపై కక్ష కట్టిన జగన్ ప్రభుత్వం, రాత్రికి రాత్రి తీసుకొచ్చిన జీవో దెబ్బకి, రాష్ట్రంలో సినిమా థియేటర్ల పరిస్థితి అయోమయంలో పడిపోయిందన్న విమర్శలున్నాయి. నిజానికి, అన్ని పెద్ద సినిమాలూ.. విడుదలైన తొలి మూడు రోజులు.. తొలి వారం.. అదనపు టిక్కెట్ రేట్లతో కాసుల పంట పండించుకుంటున్నాయి గత కొంతకాలంగా. అయితే, కేవలం ‘వకీల్ సాబ్’ సినిమాని తొక్కేసేందుకు జగన్ ప్రభుత్వం ఈ కొత్త పితలాటకం తెరపైకి తెచ్చింది.

‘వకీల్ సాబ్’ సినిమా కోసం మాత్రమే కాదు, అన్ని సినిమాలకీ ఈ తగ్గింపు టిక్కెట్ ధరల జీవో వర్తిస్తుందని ప్రభుత్వ పెద్దలు చెబుతుండడం చూస్తోంటే, ముందు ముందు విడుదలయ్యే పెద్ద సినిమాలు, ఏపీలో నష్టాలకు ఫిక్సయిపోయి విడుదలవ్వాల్సి వుంటుందన్నమాట. నిజానికి, ఇది అత్యంత సున్నితమైన సమస్య. పరిశ్రమ అంతా గళం విప్పితే కాస్తయినా ప్రయోజనం వుంటుందేమో.

గతంలో పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై పవన్ కళ్యాణ్ గళం విప్పారు. కొన్నాళ్ళ క్రితం ఓ అగ్రహీరో సినిమా పైరసీకి గురైతే, పవన్.. ఆ అగ్రహీరో తరఫున మాట్లాడారు. కానీ, పవన్ తరఫున కాకపోయినా.. సినీ పరిశ్రమ తరఫున ఈ సమయంలో గళం విప్పేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరం. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇప్పటిదాకా ఈ విషయమై స్పందించలేదు. ఎందుకిలా.? ఏపీ ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నట్లు, హీరోలు తమ రెమ్యునరేషన్లు తగ్గించుకుని, ఇకపై.. కేవలం పరిమిత బడ్జెట్ సినిమాల్నే తీయాలని డిసైడ్ అయ్యారనుకోవాలా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్ సాంగ్ అని విడుదల చేశారు. అయితే.....

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...