Switch to English

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ముసుగులో ఈ అమ్మకాలేంటి జగన్ సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది.. ఏ క్షణాన అయినా, విశాఖకు పరిపాలనా రాజధాని తరలి వస్తుంది..’ అంటూ ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి ఈ విషయమై స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. విశాఖ అభివృద్ధికి కట్టుబడి వున్నామనీ, ప్రపంచ స్థాయి నగరంగా విశాఖను అభివృద్ధి చేస్తామనీ వైఎస్ జగన్ సర్కార్ చెబుతోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందో లేదోగానీ, విలువైన భూములు మాత్రం ప్రైవేటు వ్యక్తుల పరం కాబోతున్నాయి విశాఖలో. అభివృద్ధి అంటే, రాష్ట్రంలో భూముల్ని అమ్మేయడం మాత్రమేనన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది.

కోర్టు మొట్టికాయలు పడుతున్నాసరే, ఖజానా నింపుకోవడం కోసం రాష్ట్రానికి ఇంకో మార్గం కనిపించడంలేదు. దాదాపు 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని అమ్మేయాలన్నది జగన్ సర్కార్ తాజా సంకల్పం. ఈ మేరకు ప్రకటనలు కూడా వచ్చేశాయి. రేపో మాపో ఆ భూముల్ని కొనేందుకు ‘గద్దలు’ వాలిపోవడం కూడా ఖాయమే. ఆ గద్దలు కూడా పొలిటికల్ గద్దలు, అందునా బులుగు గద్దలే అవుతాయి.. ఇందులో ఇంకో మాటకు తావే లేదు. మామూలుగా అయితే, ప్రభుత్వ భూముల ఆక్రమణ జరుగుతుంటుంది.. అది వివాదాస్పదమవుతుటుంది. ఇది కూడా ఓ టైపు ఆక్రమణ లాంటిదే.. అధికారిక ఆక్రమణ అన్నమాట. ‘ఎవడబ్బ సొమ్మనీ..’ అని అడిగే నాథుడు లేడు గనుక, విలువైన భూముల్ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టేస్తోందన్నమాట.

1500 కోట్లు వస్తాయి సరే.. విశాఖను ఆ 1500 కోట్లతో అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు ఏమన్నా వున్నాయా? ఆ ఒక్కటీ అడక్కూడదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో కాకపోయినా, కనీసం విశాఖ కోసం.. ఓ హైటెక్ సిటీ లాంటి భవనమో.. ఇంకో నిర్మాణమో గత రెండేళ్ళలో జగన్ సర్కార్ చేపట్టగలిగిందా.? లేదు, కానీ.. విశాఖపట్నంపై వైసీపీకి బోల్డంత మమకారం. ఎందుకు వుండదు.. విశాఖలో విలువైన భూములున్నాయ్ మరి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయ్.! వాటినెలా నమ్మేది.?

మేమే గెలిచేస్తాం.. అని ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పడం చూస్తున్నాం. చెప్పాలి కూడా.! గెలుపు మీద నమ్మకం లేకపోతే రాజకీయాల్లో మనుగడ కష్టం. గెలవడానికే ఎవరైనా ప్రయత్నిస్తారు.. కొందరైతే ఎంతకైనా తెగిస్తారు.. అది...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad ugly)...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్ జంటగా నటించారు. విగన్ క్రియేషన్ సమర్పణలో...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...