Switch to English

పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయ రోగం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఓ వైపు జనం వింత వ్యాధితో సతమతమవుతోంటే, ఇంకోపక్క వింత రాజకీయాలు చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. కొద్ది నెలల క్రితం ఏలూరులో ఓ ప్రాంతానికి చెందిన కొందరు ప్రజలు, వున్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడం, ఫిట్స్‌తో కింద పడిపోవడం.. ఈ క్రమంలో పెద్దయెత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొనడం తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా తీవ్ర అజలడి సృష్టించింది ఈ ఘటన. ఇప్పటిదాకా ఈ ఘటనకు కారణమేంటి.? అన్నది మాత్రం తేలలేదు. అయితే, క్రమంగా బాధితుల సంఖ్య తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని ప్రాణాలు పోయినప్పటికీ.. ఎంత వేగంగా రోగం ఉధృతమయ్యిందో, అంతే వేగంగా అలజడి చల్లారిపోయింది.

ఇక, తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోనే దెందులూరులో ఈ తరహా వింత రోగం వెలుగు చూసింది. బాధితులు కళ్ళు తిరిగి పడిపోతుండడంతో వారిని ఆసుపత్రులకు తలరించి వైద్య చికిత్స అందిస్తున్నారు. వైద్య చికిత్స అందుకున్న వెంటనే బాధితులు కోలుకుంటుండడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని మాత్రం, ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం చేయడం రాజకీయంగా పెను అలజడికి కారణమయ్యింది.

‘దేవాలయాలపై దాడులకు సంబంధించి రాజకీయ ప్రమేయం వున్నట్లు రుజువయ్యింది.. ఈ వింత రోగాల వెనుక కూడ రాజకీయ పాత్ర వుండి వుండొచ్చు..’ మంత్రి ఆళ్ళ నాని వ్యాఖ్యానించడం గమనార్హం. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వున్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు.? అధికార పార్టీలో వున్నాం.. ఏదైనా మాట్లాడతాం.. అన్నట్టుంది అధికార వైసీపీ వైఖరి. లేకపోతే, డీజీపీ.. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు సంబంధించి రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల పాత్ర వుందని ప్రకటిస్తే మాత్రం.. అది న్యాయస్థానాల్లో నిరూపితమవ్వాలి కదా.!

అయినా, దేవాలయాలపై దాడుల ఘటనకీ.. వింత రోగాలకీ ఎలా లింకులు పెట్టగలుగుతారు.? అంతర్వేది రథాన్ని ఎవరు తగలబెట్టారు.? అన్నదానిపై ఇప్పటిదాకా రాష్ట్ర పోలీసులు ఎటూ తేల్చలేకపోయారు. అలాంటిది, దేవాలయాలపై దాడులకు సంబంధించి రాజకీయ పార్టీలకు లింకులు పెట్టడమేంటి.? ఎలాగోలా, విపక్షాల్ని వివాదాల్లోకి లాగెయ్యాలి, రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన తప్ప, కనీసపాటి విజ్ఞత పాటించడంలేదు అధికార పార్టీ నేతలు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...