Switch to English

ఓటిటి రివ్యూ: సూపర్ ఓవర్ – టైటిల్ అంత ఎగ్జైటింగా లేకపోయినా ఓకే ఓకే.

Critic Rating
( 2.00 )
User Rating
( 5.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow
Movie సూపర్ ఓవర్
Star Cast నవీన్ చంద్ర, చాందిని చౌదరి, రాకేందు మౌళి
Director ప్రవీణ్ వర్మ
Producer సుధీర్ వర్మ
Music సన్నీ ఎంఆర్
Run Time 1 గంట 23 నిముషాలు
Release జనవరి 22, 2021

భానుమతి రామకృష్ణ తో ఓటిటిలో హిట్ కొట్టిన నవీన్ చంద్ర, కలర్ ఫోటోతో హిట్ కొట్టిన చాందిని చౌదరి కలిసి నటించిన సినిమా ‘సూపర్ ఓవర్’. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ప్రవీణ్ వర్మ ఈ సినిమా మధ్యలో మరణించారు. కానీ ఈ చిత్ర టీం సినిమాని ఫినిష్ చేసి రిలీజ్ చేశారు. నేడు ఆహాలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

కాశీ(నవీన్ చంద్ర), వాసు(రాకేందు మౌళి), మధు(చాందిని చౌదరి)లు మంచి ఫ్రెండ్స్.. కాశీ ఏమో యుఎస్ వెళ్లాలని బ్రోకర్ కి డబ్బు కట్టి లాక్ అయిపోతాడు, వాసు ఏదో జాబ్ చేస్తుంటాడు. కాశీకి ఇంట్లో సమస్య వలన వాసు, మధు సపోర్ట్ తో ఎంపిఎల్ క్రికెట్ బెట్టింగుల్లో డబ్బులు సంపాదిద్దామని ఫిక్స్ అవుతారు. అనుకున్నట్టుగానే కోటి 70 లక్షలు సంపాదిస్తారు. ఓ రోజు రాత్రి ఆ డబ్బులు హవాలాలో తీసుకోవడానికి బయల్దేరతారు. అలా డబ్బుకోసం వెళ్లిన కాశీ, వాసు, మధులకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ రాత్రి తెల్లార్లు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. ఈజీగా సంపాదించిన డబ్బు ఎన్ని ఆగచాట్లకు గురిచేసింది? ఎంతమంది చేతులు మారింది? చివరికి ఆ డబ్బు ఎవరికి చేరింది అనేదే కథ.

తెరమీద స్టార్స్..

నటీనటుల విషయానికి వస్తే అందరూ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఏదైనా చేసి డబ్బు సంపాదించాలి అనే పాత్రలో నవీన్ చంద్ర అదరగొట్టాడు. అటు ఆనందం, టెన్షన్, కోపం ఇలా అన్ని ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా పలికించాడు. కెరీర్ మొదట్లో అటు ఇటు ఉన్న పాత్రల్లో కనిపించిన నవీన్ ఇప్పుడు కనిపించే ప్రతి సినిమాలో మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు. ఇద్దరి డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న ఫ్రెండ్స్ మధ్య పాజిటివ్ మైండ్ తో ఉండే పాత్రలో చాందిని చౌదరి బాగా చేసింది. ప్రతి దానిలో నెగిటివ్ ని మాత్రమే చూస్తూ, అక్కడక్కడా నవ్వుని తెప్పించే డైలామా స్నేహితుడి పాత్రలో వెన్నెలకంటి రాకేందు మౌళి బాగా నటించాడు. ముఖ్య పాత్రల్లో నటించిన ప్రవీణ్, అజయ్ బాగా చేశారు.

తెర వెనుక టాలెంట్..

ఈ సినిమాకి రచన – దర్శకత్వం వహించిన ప్రవీణ్ వర్మ సినిమా రిలీజయ్యే టైంకి మన మధ్య లేరు కావున అతని గురించి నెగటివ్ కాకుండా సింపుల్ గా ఎలా ఉంది ఏంటి అనేది చెప్పుకుంటే.. కథలో పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యేది, కానీ కథనంలో టూ మచ్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం వలన చాలా చోట్ల అంత ఈజీ గా జరిగిపోతాయా అనిపిస్తుంది. అలాగే నేరేషన్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. డైరెక్టర్ గా ఓకే అనిపించుకున్నాడు. దర్శకుడు సుధీర్ వర్మ నిర్మాణం బాగుంది.

ఇక టెక్నీకల్ డిపార్ట్మెంట్స్ లో చెప్పుకోవాల్సింది, దివాకర్ మణి విజువల్స్.. దాదాపు సినిమా మొత్తం నైట్ ఎఫెక్ట్ లో ఉంటుంది, కానీ ప్రతి విజువల్స్ ని థ్రిల్లర్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా షూట్ చేసాడు. ఆ విజువల్స్ కి తగ్గట్టే సన్నీ ఎంఆర్ మ్యూజిక్ సూపర్బ్ ఉంది. పలు చోట్ల టెన్షన్ ని క్రియేట్ చేయగలిగాడు. అలాగే ‘ఆహా’లో రాబోతున్న ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చెయ్యండి. నేనైతే విపరీతంగా ఎంజాయ్ చేసాను.

విజిల్ మోమెంట్స్:

– నవీన్ చంద్ర, చాందిని చౌదరి పెర్ఫార్మన్స్
– సూపర్బ్ విజువల్స్
– బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
– ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యే క్రికెట్ నేపధ్యం

బోరింగ్ మోమెంట్స్:

– ఆసక్తి కలిగించని కథనం
– థ్రిల్స్ పెద్దగా కిక్ ఇవ్వకపోవడం
– టూ మచ్ సినిమాటిక్ లిబర్టీస్
– సరిగాలేని పలు పాత్రల ముగింపు
– సింపుల్ అండ్ తెలిసిన పాయింట్

విశ్లేషణ:

క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో సాగే ఈ ‘సూపర్ ఓవర్’ టైటిల్ కి తగ్గట్టుగా సూపర్ ఓవర్ అంత ఎగ్జైట్ గా లేదు, అలా అని మరీ అంత బాడ్ గానూ లేదు. సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసే థ్రిల్లర్ లా మొదలు పెట్టి, మధ్యలో కథనంలో థ్రిల్లింగ్ మజా మిస్ అవ్వడం, క్లైమాక్స్ మరీ ఊహాజనితంగా సాగడం సినిమాకి మైనస్. కానీ సినిమా నిడివి కేవలం 83 నిముషాలు మాత్రమే అవ్వడం వలన పరవాలేదనిపిస్తుంది.

చూడాలా? వద్దా?: బాగా బోర్ కొడుతుంటే ఒకసారి ట్రై చేయచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5 

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...