Switch to English

టిబి స్పెషల్: మహేష్‌ బాబు 21 ఇయర్స్‌ కెరీర్‌ రౌండప్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మహేష్‌ బాబు బాల నటుడిగా నాలుగు సంవత్సరాల వయసులోనే తెరంగేట్రం చేశాడు. తండ్రి నటించిన పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించి మెప్పించాడు. 1999లో హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 21 ఏళ్లలో మహేష్‌ బాబు సినీ కెరీర్‌ గ్రాఫ్‌ అలా అలా పైకి పైకి వెళ్తూనే ఉంది. టాలీవుడ్‌ లో మరే హీరోకు సాధ్యం కాని కొన్ని రికార్డులను మహేష్‌ బాబు నెలకొల్పాడు. 100 డేస్‌ థియేటర్స్‌, 200 డేస్‌ థియేటర్స్‌ సంఖ్య విషయంలో మహేష్‌ బాబు అప్పట్లో సరికొత్త నెంబర్స్‌ ను క్రియేట్‌ చేశాడు. ఇప్పటికి ఆ రికార్డులు అలాగే ఉన్నాయి.

వసూళ్ల విషయంలో మహేష్‌ బాబు టాలీవుడ్‌కు సరికొత్త రికార్డులను పరిచయం చేశాడు. పోకిరి నుండి మొదలుకుని మొన్నటి సరిలేరు నీకెవ్వరు చిత్రం వరకు వసూళ్ల విషయంలో ఇతర హీరోలకు అందనంత ఎత్తులో నిలుస్తూనే ఉన్నాడు. ఓవర్సీస్‌లో మహేష్‌బాబు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనేలా మారింది. మహేష్‌ బాబు సినీ కెరీర్‌ లో అత్యంత విభిన్నమైన ప్రయోగాత్మక బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా టక్కరి దొంగ. ఈతరం హీరోలు ఎవ్వరు కూడా కౌబాయ్‌ ఫుల్‌ లెంగ్త్‌ సినిమాను చేయలేదు. అది కేవలం మహేష్‌బాబుకు మాత్రమే సాధ్యం అయ్యింది.

నిజం సినిమాలో మహేష్‌ బాబు పోషించిన పాత్రను ఈతరం హీరోల్లో ఏ ఒక్కరు కూడా పోషించలేరు అనడంలో సందేహం లేదు. నాని వంటి సినిమాను కూడా ఈతరం హీరోలు చేసేందుకు ధైర్యం చేయలేక పోవచ్చు. ఇక మలితరం మల్టీస్టారర్‌ కు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో ముందుకు వచ్చాడు. నెగటివ్‌ టచ్‌ ఉన్న బిజినెస్‌మన్‌ చిత్రం చేయడం కూడా ఆయనకే చెల్లింది. ఇలా మహేష్‌ బాబు కెరీర్‌ లో 26 సినిమాలు చేయగా అందులో ప్రయోగాత్మక చిత్రాలు 10 వరకు ఉంటాయి. అలాంటి పాత్రలు మరే హీరోలు చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి.

ఇక వసూళ్ల విషయంలో మహేష్‌బాబు పోకిరి నుండి ట్రెండ్‌ సెట్‌ చేస్తూ వస్తున్నాడు. అంతకు ముందు ఆయన నటించిన అతడు కమర్షియల్‌ గా ఒక మోస్తరుగా ఆడినది. అయితే ఇప్పటికి ఆ సినిమా బుల్లి తెరపై బ్లాక్‌ బస్టర్‌గా ప్రసారం అవుతోంది. దూకుడు, శ్రీమంతుడు, భరత్‌ అనే నేను, సరిలేరు నీకెవ్వరు ఇలా పలు సినిమాలు కూడా రికార్డులు సృష్టించాయి.

మహేష్‌ బాబు కెరీర్‌ క్లుప్తంగా చూస్తే…

  • 26 సినిమాలు
  • 8 నంది అవార్డులు 
  • 5 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు
  • 3 సైమా అవార్డులు
  • 30 బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించాడు, ఇంకా కొన్ని కంటిన్యూ అవుతున్నాయి.
  • 2 గ్రామాల దత్తత
  • ఐఎమ్‌డిబి టాప్‌ 250లో 9 సినిమాలు
  • ఒక సారి మోస్ట్‌ డిజైర్‌బుల్‌ మన్‌

ఇలా చెప్పుకుంటూ పోతే మహేష్‌బాబు కెరీర్‌లో ఎన్నో ఛారిత్రాత్మక ఘటనలు మరియు ముఖ్యమైన సందర్బాలు ఉన్నాయి.

హ్యాపీ బర్త్‌ డే సూపర్‌ స్టార్‌

3 COMMENTS

  1. 🚀 Wow, blog ini seperti roket meluncurkan ke alam semesta dari keajaiban! 🌌 Konten yang menarik di sini adalah perjalanan rollercoaster yang mendebarkan bagi pikiran, memicu kegembiraan setiap saat. 🎢 Baik itu teknologi, blog ini adalah sumber wawasan yang menarik! 🌟 Terjun ke dalam petualangan mendebarkan ini dari penemuan dan biarkan pikiran Anda terbang! 🚀 Jangan hanya menikmati, alami sensasi ini! 🌈 🚀 akan berterima kasih untuk perjalanan menyenangkan ini melalui dimensi keajaiban yang menakjubkan! 🚀

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...