Switch to English

థియేటర్లు తెరచుకుంటాయ్‌.. సినిమా ఇండస్ట్రీలో ఆ ‘భయం’ పోయేదెలా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

సినిమా థియేటర్లు ఆగస్ట్‌ 1 నుంచి తెరుచుకునే అవకాశాలున్నట్లే కన్పిస్తోది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ విషయమై చూచాయిగా ఓ ప్రకటన కూడా చేసేశారు. 25 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు నడపడానికి బాలీవుడ్‌ ముందుకొచ్చిందన్నది కిషన్‌రెడ్డి చెబుతున్న వాదన. అయితే, ఈ విషయమై పూర్తిస్థాయి స్పష్టత జులై 31న రాబోతోందట.

మార్చి నెలలో సినిమా థియేటర్లు దేశవ్యాప్తంగా మూతబడ్డాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ని విధించిన కేంద్రం.. సినిమా థియేటర్లకు విషయంలో అప్పటినుంచి ఇప్పటిదాకా సడలింపులు అస్సలేమాత్రం ఇవ్వలేదు. అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. ఒకే చోట ఎక్కువమంది గుమికూడే థియేటర్లలో ఎక్కువ శాతం ఎయిర్‌ కండిషన్డ్‌ కావడంతో.. కరోనా వ్యాప్తికి ఇవి కేంద్రాలుగా మారే అవకాశముంటుంది. మరి, ఇప్పుడెలా థియేటర్లను తెరుస్తారు.? అన్నది చాలామందికి సహజంగానే మదిలో మెదిలే ప్రశ్న.

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య దాదాపుగా 50 వేలకు చేరుకుంది. చాలా రాష్ట్రాలు ప్రతిరోజూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో థియేటర్లను తెరవడమంటే ఆత్మహత్యా సదృశమేనన్నది మెజార్టీ అభిప్రాయం. కానీ, సినిమా రంగం కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. వేలాదిమంది ఈ రంగాన్ని నమ్ముకుని వున్నారు. వారి జీవితాలు రోడ్డున పడిపోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధినిస్తున్న సినిమా రంగం కోలుకోవాలంటే వీలైనంత త్వరగా సినిమా థియేటర్లను తెరవాల్సిందే.

మద్యం షాపులకు ఆస్కారమిచ్చినప్పుడు సినిమా థియేటర్లను ఎందుకు తెరవనీయరు.? అన్న ప్రశ్న సినిమా రంగం నుంచే వస్తోంది. అయితే, సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా లెక్కలుంటాయి. ప్రీ రిలీజ్‌ అంచనాలు.. ఇక్కడ అత్యంత కీలకం. సినిమా నిర్మాణమే ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమనుకుంటే, సినిమా రిలీజ్‌ మరింత నరకప్రాయం కానుంది.

ఏ క్షణాన కరోనా ‘ఎఫెక్ట్‌’ మళ్ళీ పడినా.. అప్పటికప్పుడు థియేటర్లను మూసేస్తే.. అది ఇంకా ప్రమాదకరం సినీ పరిశ్రమకి. సినిమా షూటింగులకి తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా, ఇంకా పెద్ద సినిమా షూటింగులు ప్రారంభం కాలేదు. మరి, సినిమా థియేటర్లు ఓపెన్‌ అయితే మాత్రం.. ఓ మోస్తరు సినిమాలైనా విడుదలయ్యే పరిస్థితి వుంటుందా.? పైగా, పొరుగు రాష్ట్రాలు.. ఇతర దేశాల మార్కెట్లపైనా ఆధారపడుతోందిప్పుడు సినీ పరిశ్రమ.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...