ఏపీలో వరుసగా కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ఇప్పటికే పలువురు మృతి చెందారు. తాజాగా నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియా గ్రామంలో ఉన్న వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. నేడు తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నట్లుగా యాజమాన్యం పేర్కొన్నారు.
గాయపడ్డ నలుగురిని నెల్లూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉందని 24 గంటల వరకు ఏ విషయము చెప్పలేమని వైధ్యులు అన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి గ్యాస్ లీక్ అవ్వకపోవడంతో స్థానికులు మరియు యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బంది ఇప్పటికే మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
893465 691715its wonderful as your other articles : D, regards for posting . 311023
8195 225152I like this web site because so significantly valuable material on here : D. 566318