Switch to English

అమరావతిపై ఈ ‘కులాల కుంపటి’ చల్లారేదెప్పుడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో మొదటి నుంచీ ‘కులం’ పేరుతో ఆరోపణలు వెల్లువెత్తుతూనే వున్నాయి. ఓ బలమైన సామాజిక వర్గ ప్రముఖులు చంద్రబాబు హయాంలో అమరావతిపై ‘కన్నేసిన’ మాట వాస్తవం. అప్పట్లో అమరావతి ఆ సామాజిక వర్గం చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయిన మాట కూడా వాస్తవమే. అమ్మకాలు, కొనుగోళ్ళలో ఆ సామాజిక వర్గం పెత్తనమే గట్టిటా నడిచింది. అలాగని, అమరావతి ప్రాంతానికి కులాన్ని ఆపాదించగలమా.? ప్రభుత్వం మారింది.. అమరావతిపై ‘కులం ముద్ర’ అలాగే వుంది.

ఈ కారణంగానే అమరావతితోపాటు మరో రెండు కొత్త రాజధానులు ప్రచారంలోకి వచ్చాయి. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేసి, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని విశాఖకి, న్యాయ రాజధానిని కర్నూలుకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ‘ఏ సామాజిక వర్గం ఎంత భూమిని అమరావతికి ఇచ్చింది.?’ అన్న విషయమై లెక్కలు తీస్తున్నారు కొందరు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆ లెక్కలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ‘అధికార పార్టీ చెప్పిన లెక్క తప్పు.. కమ్మ సామాజిక వర్గం ఇచ్చిన భూమి ఇంత.. కాపు సామాజిక వర్గం ఇచ్చిన భూమి ఇంత.. దళితుల భూముల లెక్కలు ఇంత.. బీసీల భూముల లెక్కలు ఇంత..’ అంటూ లెక్కలు చూపిస్తూ, ‘ఇప్పుడేమంటావ్‌.?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని సూటిగా ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు.

ఇదే, ఈ ‘కుల లెక్కల’ పిచ్చి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఇలా తగలడింది. అప్పుడు వైసీపీ ఇదే చేసింది.. ఇప్పుడు టీడీపీ అదే చేస్తోంది. అంతిమంగా రాష్ట్రానికే అన్యాయం జరుగుతోంది. ఇదిలా వుంటే, హైకోర్టులో రాష్ట్ర రాజధాని / రాజధానుల అంశం గురించీ, హైకోర్టు నిర్మాణం గురించీ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గవర్నర్‌ ఆమోదం పొందితే, ప్రభుత్వం మూడు రాజధానుల విషయమై ముందడుగు వేసేస్తుంది గనుక.. ఈ విషయమై జోక్యం చేసుకోవాలన్నది ఓ పిటిషన్‌ సారాంశం. అయితే, సంబంధిత బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేసినా, న్యాయ సమీక్షకు అవకాశం వుంటుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

మరోపక్క, ప్రస్తుత హైకోర్టు భవనం, అవసరాలకు తగిన విధంగా లేదనీ, కొత్త హైకోర్టు నిర్మాణం అవసరం వుందంటూ దాఖలైన పిటిషన్‌పైనా విచారణ జరిగింది. ఈ రెండు పిటిషన్లపైనా విచారణ ఆగస్ట్‌ 6వ తేదీకి వాయిదా వేశారు. మొత్తమ్మీద, ఓ వైపు గవర్నర్‌ వద్ద పంచాయితీ, ఇంకో వైపు కేంద్రం ఆరా, మరో వైపు హైకోర్టులో పిటిషన్లు.. ఇవన్నీ ఓ ఎత్తు.. రాజధాని చుట్టూ ఇంకా కుల జాడ్యం కొనసాగుతుండడం ఇంకో ఎత్తు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...