Switch to English

కట్టిన ఇళ్ళు ఎందుకు ఇవ్వరు.? జనసేన, బీజేపీ ఉమ్మడి పోరాటం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గూడు లేని పేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చే పథకాన్ని చాలా కాలం క్రితమే ప్రారంభించింది. 2014 నుంచి 2019 వరకూ పెద్దయెత్తున ఇళ్ళు నిర్మించేందుకు అటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం విదితమే. అయితే, కొన్ని కారణాలతో ఆ ఇళ్ళను లబ్దిదారులకు కేటాయించడంలో అలసత్వం ఏర్పడింది. ’జి ప్లస్‌ 3’ ప్రాతిపదికన ఫ్లాట్ల నిర్మాణం జరిగింది. లబ్దిదారుల ఎంపిక కూడా చాలావరకు పూర్తయ్యింది. అయినా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ ఇళ్ళను లబ్దిదారులకు అందించేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ జనసేన పార్టీతోపాటు బీజేపీ రేపు ఆందోళనలు చేపట్టనుంది.

బీజేపీ, జనసేన శ్రేణులు ఎక్కడికక్కడ ఈ ఆందోళనలు చేపడ్తాయని రెండు పార్టీల తరఫున ప్రకటనలు వెలువడ్డాయి. ఈ విషయమై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్పరెన్స్‌ నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజానికి, ఇంత పెద్దయెత్తున కేంద్రం, రాష్ట్రానికి ఇళ్ళను కేటాయించడం వెనుక ప్రస్తుత ఉప రాష్ట్రపతి, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చూపిన చొరవ అంతా ఇంతా కాదు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా కేంద్రం రాష్ట్రానికి ఇళ్ళను కేటాయించింది.

ప్రస్తుత ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాల్ని ఇవ్వాలనుకోవడాన్ని తప్పు పట్టలేం. కానీ, ఆ పథకం చుట్టూ అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. మార్చి నెలాఖరున ఇవ్వాల్సిన ఇళ్ళ పట్టాలు ఇప్పటిదాకా ఓ కొలిక్కి రాలేదు. ఆగస్ట్‌ 15న ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా, కోర్టు కేసుల తలనొప్పి నేపథ్యంలో అప్పటికైనా ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా.? లేదా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. అయినా, ఆల్రెడీ అన్ని హంగులతో ఫ్లాట్ల నిర్మాణం జరిగి వున్నప్పుడు, వాటిని ముందుగా లబ్దిదారులకు ఇచ్చేయాలి కదా.! అలా ఇచ్చేస్తే, చంద్రబాబుకి పేరొస్తుందనో, నరేంద్ర మోడీకి పేరొస్తుందనో బహుశా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ ఒకింత ఇబ్బంది పడుతున్నట్లుంది.

ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి విషయమ్మీద కూడా పార్టీ శ్రేణులతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకంగా టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుని జనసేనాని తప్పు పట్టారు. పార్టీ శ్రేణులు, ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సత్తా చాటాలని పిలుపునిచ్చారు జనసేనాని.

కట్టిన ఇళ్ళు ఎందుకు ఇవ్వరు.? జనసేన, బీజేపీ ఉమ్మడి పోరాటం.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...