Switch to English

ప్రత్యేక విమానంలో.. అయిననూ పోయి రావలె హస్తినకు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (అదేనండీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ) ఎంపీలు, పలువురు ముఖ్య నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికో.. రాష్ట్రానికి సంబంధించిన మరో కీలకమైన అంశం గురించో కాదండోయ్‌.! తమ పార్టీకి చెందిన ఓ ఎంపీ మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడానికి. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొద్ది రోజులుగా పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారైన విషయం విదితమే.

నిజానికి, నర్సాపురం ఎంపీ వాదనల్లో నూటికి నూరు శాతం స్పష్టత వుంది. కానీ, ఆయన్ని విమర్శించే విషయంలో వైసీపీ నేతల్లోనే స్పష్టత కరువయ్యింది. నర్సాపురం ఎంపీ విషయంలో వైసీపీ ఎంత గందరగోళంగా వుందో చెప్పడానికి, ఆయనకు ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌లో పార్టీ పేరుని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అని కాకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌గా పేర్కొనడమే నిదర్శనం.

నర్సాపురం ఎంపీకి ఢిల్లీ బీజేపీ పెద్దల ఆశీస్సులున్నాయి. ఇది ఓపెన్‌ సీక్రెట్‌. అలాంటప్పుడు, ఆయనపై అనర్హత వేటు వేయాలని ప్రత్యేక విమానంలో ‘హస్తినకు’ వైసీపీ నేతలు వెళ్ళి ఏం లాభం.? ‘అయిననూ పోయి రావలె హస్తినకు..’ అన్నట్టు తప్ప, ఈ ‘ఢిల్లీ టూర్‌’పై చిత్తశుద్ధి మాత్రం వైసీపీలో కన్పించడంలేదు.

ఇక, ఈ వ్యవహారంపై టీడీపీ నేత నారా లోకేష్‌ సోషల్‌ మీడియా వేదికగా పవర్‌ ఫుల్‌ పంచ్‌లు వేశారు. ‘అప్పుడెప్పుడో సెర్బియాలో అరెస్టయిన మీ సహ నిందితుడి కోసం కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు మీ ఎంపీని సస్పెండ్‌ చేయించడానికి ప్రత్యేక విమానంలో వెళుతున్నారు.. మీకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదా.? ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడగరా.?’ అంటూ లోకేష్‌ తన ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం.

ఇప్పుడు ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. లోకేష్‌ ట్వీట్‌లోనూ స్పష్టత వుంది. నర్సాపురం ఎంపీ అడుగుతున్నట్లుగా ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌’ పేరుతో షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చేస్తే, ఆయన వివరణ ఇస్తారేమో.! పైగా, ఆయన ‘నేను పార్టీని వీడను మొర్రో..’ అంటోంటే, ప్రత్యేకంగా ఢిల్లీకి విమానం వేసుకుని వెళ్ళి మరీ, ఆయన్ని పార్టీకి, ఆయన పదవికీ దూరం చేయాలనే ‘కసి’ వైసీపీ నేతలకు ఎందుకట.?

ఏదిఏమైనా, వైసీపీ నేతల ఢిల్లీ టూర్‌ అభాసుపాలవుతోంది. సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు వైసీపీని ఏకి పారేస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని మీ పార్టీ అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నారా.? అని నిలదీస్తున్నారు. మరి, అది పార్టీ ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానమా.? ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన విమానమా.? వైసీపీ నుంచి కాస్త స్పష్టత వస్తే బెటర్‌.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...