Switch to English

మన ఠీవీ.. పీవీ: కేసీఆర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

నిరంతర సంస్కరణశీలి, సంస్కరణాభిలాషికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పీవీ.. తెలంగాణ ఠీవీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. పీవీ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో ఆదివారం ఆయన ప్రారంభించారు. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు. 360 డిగ్రీల గొప్ప వ్యక్తిత్వమున్న వ్యక్తి పీవీ అని, ఆయన ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూసంస్కరణలు చేశారన్నారు. ‘భూస్వామి అయిన పీవీ నరసింహారావుకు వందల ఎకరాల భూమి ఉండేది. వారి కుటుంబానికి అవసరమైన మేరకు కొంత భూమి ఉంచుకుని దాదాపు 850 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించిన నిఖార్సైన వ్యక్తిత్వం ఆయన సొంతం. సంస్కరణలు తన కుటుంబం నుంచే ప్రారంభం కావాలని ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు.

కేంద్రంలో విద్యాశాఖ పేరును హెచ్చార్డీగా మార్పించిన ఘనత ఆయనదేనన్నారు. పీవీ వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవని వ్యాఖ్యానించారు. 360 డిగ్రీల పర్సనాలిటీ పీవీ అని పెద్ద పుస్తకమే రాయొచ్చన్నారు. నెహ్రూకి సమాంతరమైన వ్యక్తి పీవీ అని స్పష్టంచేశారు. పీవీ నిరంతర విద్యార్థి, అధ్యయనశీలి, సామాజిక దృక్పథం కలిగిన పీవీ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. కుల, ధన బలం అనేదే లేకుండా ఆయన రాజకీయ ప్రస్థానం సాగిందని ప్రశంసించారు.

ప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. బంగారం మొత్తం కుదువపెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉండేదని, చరిత్ర చూస్తే అదంత తెలుస్తుందని పేర్కొన్నారు. అలాంటి సమయంలో ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా చేసి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారని తెలిపారు. ఆయన చర్యల ఫలాలను ప్రస్తుతం మనం చూస్తున్నామని వివరించారు.

అయితే, ప్రపంచాన్ని దేశం వైపు చూసేలా చేసిన వ్యక్తికి సరైన గౌరవం దక్కలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు గల కారణాలను ప్రస్తావించడానికి ఇది సమయం కానందున వాటి జోలికి వెళ్లడంలేదంటూ పరోక్షంగా కాంగ్రెస్ కు చురకలంటించారు. పార్లమెంటులో పీవీ చిత్రపటం పెట్టాలని కోరతామన్నారు. మాజీ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని విమర్శలు చేశారు. అలాగే పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తామని వెల్లడించారు. తెలుగు అకాడమీకి పీవీ పేరు పెట్టాలంటూ ప్రతిపాదనలు వచ్చాయని, తప్పకుండా దానిని పరిశీలించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...