థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశమైతే లేదు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వెళుతుండడంతో థియేటర్లు త్వరలో ఓపెన్ చేస్తారన్న ఆశ కూడా క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలకు ప్రత్యామ్నాయంగా మారింది ఓటిటి రిలీజ్. చిన్న సినిమాలు, థియేటర్లు ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేయలేని వారు, థియేటర్లు ఓపెన్ అయినా కూడా తమ సినిమాలకు సరైన థియేటర్లు దొరకవు అనుకున్న వారు ఇలా ఓటిటి రిలీజ్ వైపు ఆకర్షితులు అవుతున్నారు. మిగతా భాషలతో పోలిస్తే ఓటిటి హవా మన దగ్గర తక్కువే ఉన్నా కానీ క్రమంగా తెలుగు సినిమాలు కూడా ఈ బాటలో నడుస్తున్నాయి.
అమృతారామమ్ తర్వాత ఏ చిత్రం కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అవ్వలేదు. సత్యదేవ్ నటించిన రెండు సినిమాలు ఓటిటి రిలీజ్ కు క్యూ కట్టి ఉన్నాయి. అవి ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, 47 డేస్. అయితే వీటి రిలీజ్ డేట్ లపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా మరో తెలుగు సినిమా ఓటిటి రూట్లోకి వచ్చింది. అదే కృష్ణ అండ్ హిస్ లీల. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధూ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను క్షణం ఫేమ్ రవికాంత్ పేరెపు తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రద్ధ శ్రీనాథ్, షాలిని కథానాయికలుగా నటించారు. యూత్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ఓటిటిలో రిలీజ్ అవ్వనుందని అధికారికంగా వెల్లడైంది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశముంది.
Ok rumours are done!! The stories are coming out!! Sooner than you think…#KrishaAndHisLeela #Basedontruerumours Meet Krishna soon…..sooner than you think! 😉@ravikanthperepu | @siddhu95229008 | @shraddhasrinath | @IamSeeratKapoor | @sureshprodns | @viacom18 | @SanjayReddySR pic.twitter.com/CdODHoxnWb
— Rana Daggubati (@RanaDaggubati) June 21, 2020