Switch to English

కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఇండియాలో రోజు రోజుకీ కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై వైరస్ సోకినా ఇంట్లోనే ఉంచి చికిత్స చేయించుకోవాలి. వైద్యుల పర్యవేక్షణ, వారిచ్చే సలహాలతో 17 రోజుల పాటు చికిత్స జరుగుతుందని, అత్యవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 18005994455 ను సంప్రదించాలని గురువారం నూతన గైడ్ లైన్స్ విడుదల చేసింది.

వైరస్ సోకిన వారికి చిన్నారులు, వృద్ధులను దూరంగా ఉంచి.. వీలైతే మరో ప్రాంతానికి పంపాలి. వైరస్ లక్షణాలు కనిపించినా, వైరస్ సోకినట్టు నిర్దారణ అయినా ఆందోళనా చెందొద్దు. అనుమానితులు వైద్యుల సలహా మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను స్థానిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి వేసుకోవాలి.

ఆరోగ్య సేతు యాప్ ను తమ ఫోన్లలో ఉంచుకుని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం ఇవ్వాలి. అస్వస్థత తీవ్రమైనా, కొత్త లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలి.

మంచం మీద నుంచి దిగినా, బయటకు వచ్చినా మాస్క్ ధరించాలి. దగ్గినా, తుమ్మినా రుమాలు, టిష్యూలు అడ్డు పెట్టుకుని, ఆపై డస్ట్ బిన్ లో వేయాలి. రోజుకు రెండు లీటర్ల గోరు వెచ్చని నీరు తాగాలి. ఏ వస్తువును తాకినా వెంటనే శానిటైజ్ చేయాలి.

వైరస్ సోకిన వారు తానున్న గదిని తానే స్వయంగా శుభ్రం చేసుకోవాలి. తమ దుస్తులను డెట్టాల్ వేసిన వేడినీటిలో అరగంట నానబెట్టి, వాటిని ఉతికి, స్వయంగా ఆరేసుకుని వాడుకోవాలి. ముఖం, పెదవులు నీలం రంగులోకి మారినా, విపరీతంగా జ్వరం వచ్చినా, గుండెలో నొప్పి వచ్చినా, ఊపిరి ఆడకపోయినా వైద్యులను సంప్రదించాలి.

బాధితుల గదిలోకి వెళ్లిన సమయంలో ఇతరులు మూడు పొరలు ఉన్న మాస్క్ ను ధరించాలి. మాస్క్ ను ధరించిన తరువాత ముట్టుకోకుండా.. వినియోగం తరువాత కాల్చి వేయాలి. ఆ గది లోపలికి వెళ్లేటప్పుడు, వచ్చిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వెల్లడించింది.

రోగి కోసం వండిన ఆహారాన్ని అతనున్న గదికే చేర్చాలి. శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారన్ హీట్ దాటి, నాడి వేగం పెరిగితే వైద్యులకు సమాచారం ఇవ్వాలి. రోగి వాడే వస్తువులను 30 నిమిషాలు వేడి నీటిలో ఉంచి ఆపై శుభ్రం చేసి, తిరిగి వాడుకోవచ్చు.

వైరస్ సోకిన వ్యక్తి ఇంటి పక్కనే ఉన్నా.. ఇరుగు పొరుగు వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. క్వారంటైన్ లో ఉండాల్సిన వ్యక్తులు బయట కనిపిస్తే, అధికారులకు తెలియజేయాలి.

వ్యాధి సోకిన వారితో పాటు ప్రతి ఒక్కరూ పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బ్రౌన్ రైస్, గోధుమలు, చిరు ధాన్యాలు, బీన్స్, చిక్కుడు, ఓట్స్ తదితర ప్రొటీన్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, క్యారెట్, బీట్ రూట్, నిమ్మ, బత్తాయి, క్యాప్సికమ్ అధికంగా తీసుకోవాలి. ఆహారంలో పసుపు, అల్లం, వెల్లుల్లి వంటివి చేర్చాలి.

నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకోకూడదు. మైదా, వేపుళ్లు, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, పామాయిల్, బటర్ లకు దూరంగా ఉండాలి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....