Switch to English

బెజవాడ గ్యాంగ్‌ వార్‌ కేసు ఛేదించిన పోలీసులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

బెజవాడ అంటే గ్యాంగ్‌ వార్‌కు అప్పట్లో పెట్టింది పేరు. కాని గత దశాబ్ద కాలంగా అక్కడ అల్లర్లు తగ్గాయి, నేరాల శాతం కూడా చాలా వరకు తగ్గింది. బెజవాడ చాలా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఇటీవల జరిగిన గ్యాంగ్‌ వార్‌ రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలంటూ ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. రెండు గ్యాంగ్‌ల మద్య జరిగిన ఈ వార్‌ ప్రస్తుతం పెద్ద దుమారంను రేపుతున్న నేపథ్యంలో పోలీసులు చాలా స్పీడ్‌గా ఈ కేసును తెమల్చడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నింధితులను ఇప్పటికే అరెస్ట్‌ చేసిన పోలీసులు మరింత లోతుగా ఎంక్వౌరీ చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ వార్‌కు ప్రధాన కారకుడు సోనాలిక్‌ నాగబాబు. ఈయన సెటిల్‌మెంట్లు చేస్తూ ఉండేవాడు. ఇటీవల ఒక అపార్ట్‌మెంట్‌ విషయంలో సన్నిహితుడు సందీప్‌తో కలిసి ధనేకుల శ్రీధర్‌, ప్రదీప్‌ రెడ్డిల మద్య రాజీ కుదిర్చేందుకు సన్నాహాలు చేశాడు. ఈ రాజీ కోసం ఒక ప్లేస్‌ కావాల్సి ఉండగా దానికి సందీప్‌ ప్లాన్‌ చేశాడు. ఈ భేటీకి ప్రదీప్‌ రెడ్డి వద్ద గుమస్తాగా చేస్తున్న వ్యక్తి తన స్నేహితుడు అయిన పండును పిలిపించాడు. నేర చరిత్ర ఉన్న పండు సెటిల్‌మెంట్‌ వద్దకు రావడంను సందీప్‌ ఒప్పుకోలేదు.

అక్కడ నుండి పండును వెళ్లి పోవాల్సిందిగా సందీప్‌ అన్నాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య ఘర్షణ జరిగింది. దాంతో పండు ఇంటికి వెళ్లి సందీప్‌ రెడ్డి మనుషులు నానా రచ్చ చేశారు. సందీప్‌ రెడ్డిని చంపిన తర్వాతే ఇంటికి రా అంటూ పండు తల్లి రెచ్చగొట్టడంతో ఈ గొడవ మరింత ముదిరింది. సందీప్‌ రెడ్డిపై దాడి చేసేందుకు పండు చాలా వ్యూహాలు పన్నాడు. తనకు పరిచయం ఉన్న కొందరు రౌడీ షీటర్స్‌తో పాటు తనకు సంబంధం ఉన్న గంజాయి సరఫరా గ్యాంగ్‌ను కూడా రంగంలోకి దించాడు. దాడి సమయంలో పండు గ్యాంగ్‌ అంతా కూడా గంజాయి సేవించి ఉన్నారు. మత్తులో ఉన్న వారు కన్ను మిన్ను కానక దాడికి పాల్పడ్డారు అంటూ పోలీసులు నిర్థారించారు.

ఈ కేసులో మరో ట్విస్ట్‌ ఏంటీ అంటే ఈ దాడి చేయించిన పండు మానసిక పరిస్థితి బాగాలేదు అంటూ గతంలో వైధ్యులు సర్టిఫికెట్‌ ఇచ్చారు. తన కొడుకు మానసికంగా బాగాలేని కారణంగా అతడిని వదిలి పెట్టాలంటూ పండు తల్లి కోరుతోంది. ప్రభుత్వం మాత్రం ఈ కేసు విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరిస్తుంది. మళ్లీ బెజవాడలో గ్యాంగ్‌ వార్‌ జరుగకుండా నేరస్తులను శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...