Switch to English

పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌.. అంతకు మించి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

జ్వరం వస్తే.. అది తగ్గడానికి పారాసిటమాల్‌ ట్యాబ్లెట్‌ వేస్తాం. పరిసరాల పరిశుభ్రత కోసం బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతాం. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలిసిన విషయాలే. ఓ ముఖ్యమంత్రి, ప్రపంచాన్ని వణికస్తోన్న మహమ్మారి విషయంలో ‘పారాసిటమాల్‌.. బ్లీచింగ్‌ పౌడర్‌..’ అంటూ వ్యాఖ్యలు చేస్తే ఎలా.? పైగా, పదే పదే ఆ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి, ఆయన అనుచరగణం, అనుకూల మీడియా సమర్థించుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందా.? కీడు జరుగుతుందా.?

లాక్‌డౌన్‌కి ముందు, ఈ పారాసిటమాల్‌ ట్యాబెట్లనే విదేశాల నుంచి వచ్చిన చాలామంది వాడారు.. ఈ క్రమంలోనే వాళ్ళలో చాలామంది ఎయిర్‌పోర్టుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ నుంచి బయటపడ్డారు. ఫలితంగా దేశంలో కరోనా ఏ స్థాయిలో విస్తరించిందో చూస్తున్నాం. మత ప్రార్థనలకు వెళ్ళి, కరోనా అంటించుకుని వచ్చినవారూ ఇదే పద్ధతి ఫాలో అయ్యారంటే పారాసిటమాల్‌ ‘పనితనం’ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కోరోనా వైరస్‌ సోకితే, జ్వరం కూడా వస్తుంది. అలాగని, జ్వరానికి వాడే పారాసిటమాల్‌ వేస్తే కరోనా వైరస్‌ తగ్గుతుందా.? ఏంటీ చెత్త లాజిక్‌.? కొంతమందిలో కరోనా వైరస్‌ లక్షణాలు అస్సలేమాత్రం కన్పించకుండానే ఆ వైరస్‌ బయటపడ్తోంది. తద్వారా తెలియకుండానే చాలామందికి కరోనా వైరస్‌ని అంటించేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు. పారాసిటమాల్‌ని వాడాల్సిందేనేమో.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం కూడా మంచిదేనేమో.! కానీ, వాస్తవ పరిస్థితుల్ని ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు అర్థం చేసుకోకపోవడమే దారుణం.

కరోనా వైరస్‌ సోకితే ఊపిరితిత్తులు పాడైపోతాయి మొర్రో.. అని పలు వైద్య నివేదికలు చెబుతున్నాయి. గుండెకు సంబంధించిన రక్త నాళాలు దెబ్బతింటాయని మెడికల్‌ జర్నల్స్‌ పేర్కొంటున్నాయి. ఇవన్నీ పరిశోధనలు.. సొల్లు కబుర్లు కానే కావు. కిడ్నీ, లివర్‌ వంటి కీలక అవయవాలు దెబ్బతింటున్నాయి కరోనా వైరస్‌ కారణంగా. కరోనా వైరస్‌ బారిన పడ్డ వారికి భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు వస్తాయన్న అనుమానాల్ని పలు పరిశోధనలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇంతటి ప్రమాదకరమైన వైరస్‌తో ‘కలిసి జీవించడం’ అన్న ఆలోచన చేయగలమా.? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడటం.. పైగా తన అవివేకాన్ని పదే పదే సమర్థించుకోవడం.! నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది వ్యవహారం. రూపాయి పారాసిటమాల్‌, పది రూపాయల బ్లీచింగ్‌ పౌడర్‌ని కాదని.. వందల కోట్లు.. వేల కోట్లు.. లక్షల కోట్లు ఎందుకు దేశాలు వెచ్చిస్తున్నట్లు.? కాస్తంత ఇంగితం వుండాలి కదా.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...