Switch to English

కమలం, సైకిల్.. మళ్లీ కలిసేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ప్రపంచం కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మళ్లీ కలిసి సాగుతాయా అని ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పాత మిత్రులు మళ్లీ కలిసే అవకాశం ఉందా అని విశ్లేషణలు సాగుతున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ లో మాట్లాడుకోవడమే ఇందుకు కారణం. కరోనా నేపథ్యంలో పలు పార్టీల అధినేతలతో మాట్లాడిన మోదీ.. అనంతరం చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడంతో ఈనెల 14న ఉదయం బాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా చంద్రబాబే మీడియాకు తెలిపారు.

దీంతో రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు మొదలైపోయాయి. ఇక బాబుతో బీజేపీ చెట్టపట్టాలు ఖాయమంటూ ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల నుంచి అష్టకష్టాలు పడుతున్న బాబుకు ప్రధాని ఫోన్ చేయడంతో ఇక అంతా మంచే జరుగుతుందని పలువురు జోస్యం చెబుతున్నారు. అయితే, కమలనాథులు పాత విషయాలు మరచిపోయారా అనేది సందేహమే. నిజానికి చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోద్రా అల్లర్ల విషయంలో మోదీని తీవ్రంగా తప్పుబట్టారు.

అలాంటిది మోదీ హవా సాగుతున్న సమయంలో బీజేపీతో పొత్తుకు ఇదే చంద్రబాబు తహతహలాడారు. 2014 ఎన్నికల్లో పలువురి ద్వారా రాయబారం నడిపి ఏపీలో బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపిస్తూ బీజేపీకి బైబై చెప్పారు. అప్పటి నుంచి మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పైగా మోదీకి వ్యతిరేకంగా కూటమి కూడగట్టేందుకు ప్రయత్నాలు చేశారు. చివరకు కాంగ్రెస్ తో కూడా చేతులు కలిపారు. తిరుపతి వచ్చిన అమిత్ షాపై టీడీపీ శ్రేణులు దాడికి కూడా ప్రయత్నించాయి. ఇవన్నీ కమలనాథుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. ఎన్నికల్లో రెండోసారి కూడా బీజేపీయే అధికారంలోకి రావడంతో బాబుకు తత్వం బోధపడింది.

అప్పటి నుంచి బీజేపీపై ఒక్క విమర్శ కూడా చేయకుండా మళ్లీ దోస్తీకి ప్రయత్నాలు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రధాని తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ ఎన్నికలనాటి విషయలు మనసులో పెట్టుకున్న కమలనాథులు బాబుకు స్నేహహస్తం ఇవ్వలేదు. పలు పార్టీల అధినేతలకు ఫోన్ చేసిన మోదీ.. చంద్రబాబుకు మాత్రం ఫోన్ చేయలేదు. దీంతో ప్రధానితో మాట్లాడాలని అనుకుంటున్నట్టు ఆయన కార్యాలయానికి తెలియజేయడంతో మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో తమకు లైన్ క్లియర్ అయినట్టేనని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే, అది అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల సందర్భంగా బాబు చేసిన విమర్శలను మోదీ, షా మరచిపోయే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు ఏపీలో అధికార పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. టీడీపీతో మాత్రం సానుకూల వైఖరి కనబరచడం విశేషం. రాష్ట్ర స్థాయిలో టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు ఒకరకంగా ఉండగా.. జాతీయ స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు మళ్లీ కలిసి సాగుతాయా అనేది ఇప్పుడే చెప్పలేం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

ఎక్కువ చదివినవి

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...