Switch to English

భారీగా పెరగనున్న ప్రైవేటు ఉద్యోగుల పెన్షన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇదో తీపి కబురు. ఉద్యోగ విరమణ చేసిన అనంతరం వీరు పొందే పెన్షన్ భారీగా పెరగనుంది. ఇందుకు సంబంధించి అధిక పెన్షన్ పొందే దిశగా సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ప్రైవేటు ఉద్యోగులకు వారి వేతనం ఆధారంగా పెన్షన్ ఇవ్వాలని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) వేసిన ప్రత్యేక లీవ్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

దీంతో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఉద్యోగులకు వచ్చే పింఛన్ భారీగా పెరగనుంది. ఉద్యోగ విరమణ చేసిన సమయంలో సదరు ఉద్యోగి పొందుతున్న పూర్తి స్థాయి వేతనం ఆధారంగానే పెన్షన్ ఇవ్వాలని ఇటీవల కేరళ హైకోర్టు ఈపీఎఫ్ఓని ఆదేశించింది. నెలకు గరిష్టంగా రూ.15వేలకు మాత్రమే పెన్షన్ లెక్కించి ఇస్తున్న పద్ధతికి స్వస్తి పలకాలని స్పష్టంచేసింది.

దీంతో ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్ ను స్వీకరించడానికి సరైన కారణాలేవీ తమకు కనబటంలేదని వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ వ్యాజ్యాన్ని తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. దీంతో కేరళ హైకోర్టు ఆదేశాలను ఈపీఎఫ్ఓ అమలు చేయాల్సి ఉంది. అయితే, ఇకపై అదనపు కాంట్రిబ్యూషన్ మొత్తం పింఛను నిధికి కాకుండా ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్) వైపు వెళుతుంది.

దీంతో పీఎఫ్ కార్పస్ తగ్గి, ఆ మేరకు ఈపీఎస్ పెరుగుతుంది. పీఎఫ్ మొత్తం తగ్గినప్పటికీ ఎలాంటి నష్టం ఉండదు. అక్కడ తగ్గిన మొత్తం ఈపీఎస్ లో పెరుగుతుంది కాబట్టి, పెద్దగా తేడా ఉండదు. కేంద్ర ప్రభుత్వం 1995లో ఈపీఎస్ ను ప్రారంభించింది. దీని ప్రకారం సంస్థలు తమ ఉద్యోగుల వేతనంలో 8.33 శాతాన్ని ఈపీఎస్ లో జమ చేయాలి. గరిష్టంగా రూ.6,500 మొత్తంలో 8.33 శాతం లేదా నెలకు రూ.541 గా ఇది ఉండేది. 1996లో ఈ చట్టానికి సవరణ చేసి, ఉద్యోగికి వచ్చే పూర్తి వేతనం ఆధారంగా 8.33 శాతం మొత్తాన్ని లెక్కించి ఈపీఎస్ లో జమ చేయాలని కేంద్రం నిబంధనలు విధించింది.

అయితే, 2014 సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ నిబంధనలను ఈపీఎఫ్ఓ సవరించింది. పింఛను మొత్తాన్ని గరిష్టంగా నెలకు రూ.15 వేల వేతనంలో 8.33 శాతం లేదా రూ.1250 గా లెక్కగట్టి జమచేయాలని పేర్కొంది. అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఓ మెలిక పెట్టింది. పూర్తిస్థాయి వేతనం ఆధారంగా ఈపీఎస్ పొందాలనుకునే ఉద్యోగుల గత ఐదేళ్ల వేతన సగటును పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

ఇంతకుముందు ఉన్నట్టుగా గత ఏడాదిగా పొందిన వేతన సగటు ఆధారంగా ప్రయోజనాలు పొందలేరని స్పష్టంచేసింది. ఈ నిబంధన వల్ల ఉద్యోగుల పెన్షన్ తగ్గిపోతుంది. దీంతో పలువురు ఉద్యోగులు ఈ నిర్ణయంపై కేరళ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. 2014 సెప్టెంబర్ ఒకటో తేదీనాటి ఈపీఎఫ్ఓ ఉత్తర్వులను కొట్టివేసింది. పాత పద్ధతి ప్రకారం ఉద్యోగుల గత ఏడాది వేతన సగటు ఆధారంగానే పెన్షన్ లెక్కించాలని ఆదేశించింది.

అయితే, వీటిని సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ అక్కడా చుక్కెదురైంది. ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనం ఆధారంగానే పెన్షన్ ఇవ్వాలంటూ 2016 అక్టోబర్లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. అయినప్పటికీ, ఈపీఎఫ్ఓ మాత్రం ట్రస్టుల ద్వారా ఈపీఎఫ్ నిర్వహణ జరుగుతున్న ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ వంటి నవరత్న కంపెనీలను ఈ నిబంధనల నుంచి మినహాయించాలని నిర్ణయించింది.

దీనిపై అభ్యంతరాలు రావడంతో కేరళ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మద్రాస్ సహా పలు రాష్ట్రాల హైకోర్టులు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పులు వెలువరించాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఇక ఉద్యోగులకు వారి పూర్తి వేతన ఆధారంగానే పెన్షన్ లభించనుంది. 2014 సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత ఉద్యోగాల్లో చేరినవారు కూడా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. ప్రవీణ్ కోహ్లీ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రస్తుతం రూ.2,372 పింఛన్ అందుకుంటుండగా.. ఇకపై అతడికి రూ.30,592 పెన్షన్ అందనుంది. సర్వీసులో ఉన్న సంవత్సరాలు, చివరగా డ్రా చేసిన వేతనం ఆధారంగా ఆయా ఉద్యోగుల పెన్షన్లను లెక్కగట్టనున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...