పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ల కాంబోలో గబ్బర్‌సింగ్ వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్‌ను దక్కించుకున్న నేపథ్యంలో మళ్లీ వీరిద్దరి కాంబో అనగానే అంచనాలు పీక్స్‌కు చేరాయి. ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్ సాబ్ చిత్రాన్ని చేస్తున్న పవన్ కళ్యాణ్ సమ్మర్ నుండి క్రిష్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయినా పవన్ హాజరు కాలేదు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ మూవీ ఉంటుంది.
ఇది కూడా సమ్మర్ లేదా ఆ తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి కనుక హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. మొన్నటి వరకు ఇదే ఏడాది ఈ మూడు సినిమాలు విడుదల చేయాలని భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వకీల్ సాబ్ మరియు క్రిష్ మూవీలు ఈ ఏడాదిలో వచ్చి హరీష్ శంకర్ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ సన్నిహితుల వద్ద మాట్లాడుతూ సంక్రాంతికి తమ కాంబో మూవీ వస్తుంది అన్నట్లుగా చెప్పాడు. జనవరి 8న ఆర్ఆర్ఆర్ చిత్రం ఉన్న విషయం తెల్సిందే. అయినా కూడా వారం ఆలస్యంగా అంటే సంక్రాంతి పండగ వరకు పవన్ మూవీని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
64995 743457This internet web site is often a walk-through rather than the details you wanted about it and didnt know who ought to. Glimpse here, and youll certainly discover it. 152771
99420 732852Thanks for the information provided! I was researching for this article for a long time, but I was not able to see a dependable source. 46433
960048 834033Gratitude for building this send! I in reality recognize the no cost information. 511346
301299 298686I truly treasure your piece of work, Wonderful post. 925484