Switch to English

పవన్ లక్ష్యం జగనేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అధినేతలపై విమర్శలు, ఆరోపణలు చేయడం చాలా సాధారణమైన విషయం. తనకు పోటీగా ఉన్న ప్రత్యర్థులపై ధ్వజమెత్తడం ఏ నాయకుడైనా చేసే పనే. టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్సార్ అధినేత జగన్ తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడుతున్నారు.

ఇక జగన్ అయితే, చంద్రబాబుతోపాటు ఆయన పార్టనర్ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరుగుతున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం కేవలం జగన్ మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో ముందుకు సాగుతున్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. ఈ ప్రభుత్వం సరిగా పని చేయలేదు.. ఎన్నికల్లో వారిని సాగనంపి మాకు పట్టం కట్టండి అంటూ ప్రచారం చేస్తారు. కానీ పవన్ తీరు ఇందుకు భిన్నంగా ఉంటోంది.

ప్రతిపక్షంలో ఉన్న జగన్ పైనే ఆయన విమర్శలు చేస్తున్నారు. ఫక్తు అధికార పార్టీ నేతగానే వ్యవహరిస్తున్నారు. ఏ సభలోనైనా చంద్రబాబుతో సమానంగా జగన్ పేరునే స్మరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ కు లోపాయికారీ పొత్తు ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. జగన్ కు ఆత్మాభిమానం లేదా? ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నారు. ఇదేనా పులివెందుల పౌరుషం? అంటూ విరుచుకుపడుతున్నారు.

ప్రశ్నించడానికే తాను వచ్చానంటూ తొలుత ప్రచారం చేసుకున్న పవన్.. తర్వాత సీఎం అవుతానంటూ మనసులో మాట బయట పెట్టుకున్నారు. తర్వాతి పరిణామాల నేపథ్యంలో కింగ్ కాకపోయినా, కింగ్ మేకర్ పాత్ర పోషించగలనని అనుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో 30 సీట్లు వచ్చిన కుమార స్వామి సీఎం అయిపోవడంతో మళ్లీ ఆ కుర్చీపై మనసు పారేసుకున్నారు.

ఏపీలో కూడా అలాంటి పరిస్థితే వస్తే, సీఎం పీఠం ఎక్కొచ్చని భావించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ స్థాయిలో ఆయన కసరత్తు చేస్తున్నారా? పక్కా వ్యూహాలకు ముందుకెళ్తున్నారా అంటే లేదనే అనిపిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీతో రహస్య అవగాహన ఉందంటూ వైఎస్సార్ సీపీ చేస్తున్న ఆరోపణలకు ఊతమిచ్చేలా ఆయన చర్యలు ఉంటున్నాయి.

ప్రచారంలో కేవలం జగన్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఏదో మొహంమాటం కొద్దీ టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారనే భావన జనాల్లోకి వెళ్లిపోతోంది. ప్రచారంలో భాగంగా జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్న జనసేన అధినేత.. ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపడంలేదు. దీంతో సహజంగానే ఈ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందేమో అనే అనుమానం కలగకమానదు.

వాస్తవానికి పవన్ కల్యాణ్ కు 5 నుంచి 10 శాతం ఓట్లు రాబట్టుకునే సత్తా ఉంది. అయితే, టీడీపీతో తమకు ఎలాంటి అవగాహనా లేదని చెప్పడంతోపాటు ఆ పార్టీ వైఫల్యాలను కూడా గట్టిగా ఎండగట్టి.. టీడీపీకి తామే ప్రత్యామ్నాయం కాగలమనే భరోసా కల్పించడంలో పవన్ విఫలమవుతున్నారు. అలా చేస్తే ఆయనకు మరికొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

కానీ, అలా చేయకపోవడంతో జనసేన సింగిల్ డిజిట్ సీట్లకు మాత్రమే పరిమితం కావొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా జగన్ విజయావకాశాలను ప్రభావితం చేయడానికే పవన్ పోటీ చేస్తున్నారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పవన్ తన వ్యవహార శైలి మార్చుకుంటారో లేదో వేచి చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...