Switch to English

తెలుగు రాష్ట్రాలు.. ఒకటి అలా మరొకటి ఇలా..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రెండు తెలుగు రాష్ట్రాల్లో పరస్పర విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుండగా.. లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీ మాత్రం రాజకీయపరమైన విభేదాలు, గొడవలతో అంతకంతకూ వెనకబడుతోంది. ప్రస్తుతం ఏపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

ఏపీ రాజధానిగా అమరావతితోపాటు విశాఖ, కర్నూలును ఎంపిక చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై అటు అమరావతి ప్రాంత ప్రజలతోపాటు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. హైకోర్టు కూడా రాజధాని తరలింపు ప్రక్రియను ఆపాలంటూ స్పష్టంచేసింది. మరోవైపు శాసనమండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి సదరు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించే విషయంలో విజయం సాధించింది.

దీంతో అహం దెబ్బతిన్న అధికార పార్టీ.. ఏకంగా మండలినే రద్దు చేసే దిశగా పావులు కదుపుతోంది. నిజానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలులపై మినహా అభివృద్ధిని పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదని పలువురు పేర్కొంటున్నారు. అయితే, రాజధానుల వికేంద్రీకరణ ద్వారా తాము రాష్ట్రం మొత్తాన్ని సమానంగా అభివృద్ధి చేస్తామని అధికార పార్టీ చెబుతోంది.

అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. వెరసి రాష్ట్రంలో గందరగోళం రాజ్యమేలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉండదని.. అధికార, ప్రతిపక్షాల బెట్టు కారణంగా రాష్ట్రం అధోగతి పాలయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ మాత్రం తెలివిగా ముందుకెళుతోంది. ఇప్పటికే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. మరిన్ని పెట్టుబడుల సాధన కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్స్ లీడర్స్ సమ్మిట్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి కేటీఆర్.. పలువురు ప్రముఖ కంపెనీల అధిపతులతో సమావేశమై పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.

పెట్టబడులకు తమ రాష్ట్రం ఎంతో అనుకూలమని, పైగా అనుమతుల విషయంలో తాము ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అందరికీ వివరిస్తూ.. పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే పిరమాల్ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధం కాగా, కోకోకోలా సైతం అందుకు అంగీకారం తెలిపింది. ఇలా తమ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ పరితపిస్తుండగా.. ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం దీనిని విస్మరిస్తున్నానే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఇరు వర్గాలు పట్టుదలకు పోకుండా రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...