Switch to English

కార్తీ ‘దొంగ’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

నటీనటులు: కార్తీ, జ్యోతిక, సత్య రాజ్..
నిర్మాత: ఆర్.వి శ్రీనివాస్
దర్శకత్వం: జీతూ జోసెఫ్
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్: గోవింద్ వసంత
ఎడిటర్‌: విఎస్ వినాయక్
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019

‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ హీరో కార్తీ ఈ సారి తన వదిన జ్యోతిక కలిసి చేసిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘దొంగ’. ‘దృశ్యం’ ఒరిజినల్ మలయాళ వెర్షన్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరణజీవి ‘ఖైదీ’ టైటిల్ తో హిట్ అందుకున్న కార్తీ మరో టైటిల్ ‘దొంగ’తో కూడా హిట్ అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ:

సత్యరాజ్ ఒక పొలిటికల్ లీడర్.. తన కుటుంబంలో భార్య సీత, పెద్ద కుమార్తె జ్యోతిక మరియు మదర్ షావుకారు జానకి కలిసి ఉంటారు. చిన్న తనంలోనే ఇంట్లో గొడవ పడి సత్య రాజ్ కుమారుడు శర్వా ఇంటి నుంచి పారిపోతాడు. కానీ 15 ఏళ్ళ తర్వాత శర్వా అని చెప్పుకొని ఆ ప్లేస్ లో విక్కీ(కార్తీ) ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చిన కొద్దీ రోజులకే కార్తీ ఒరిజినల్ కాదని డూప్లికేట్ అని తెలిసిపోతుంది. అదే టైంలో తను రియల్ శర్వా అనుకొని వికీ మీద మర్డర్ అటెంప్ట్స్ జరుగుతుంటాయి? అసలు శర్వా మీద మర్డర్ అటెంప్ట్స్ చేసింది ఎవరు? శర్వా ప్లేస్ లో విక్కీ ఎందుకు వచ్చాడు? విక్కీ శర్వా మిస్టరీని చేధించాడా? లేదా? చివరికి శర్వా ఏమయ్యాడు? అనేది తెలుసుకోవడమే కథ..

సీటీమార్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

సినిమాలో కీలక పాత్రలు పోషించిన కార్తీ మరియు సత్య రాజ్ ల నటనే ప్రధాన బలం. అల్లరి కుర్రాడిగా, టూరిస్ట్ గైడ్ గా, దొంగ గా ఇలా ప్రతి వేరియేషన్ లో కార్తీ మంచి నటనని కనబరిచాడు. అలాగే సత్యరాజ్ పాజిటివ్ మరియు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జీవించాడు. ఇక సీత, హరీష్ పేరడి, అమ్ము అభిరామిలు వారి వారి సీన్స్ కి న్యాయం చేశారు.

ఇక సినిమా పరంగా చూసుకుంటే ఆసక్తికరంగా మొదలైనప్పటికీ ఒక 10 నిమిషాలకే బోరింగ్ గా మారిపోద్ది. ఇంటర్వల్ సత్యరాజ్ ట్విస్ట్ రివీలేషన్ చాలా బాగుంటుంది. సెకండాఫ్ మీద ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అలాగే సెకండాఫ్ లో జ్యోతికని కార్తీ సేవ్ చేసే ఫైట్ బాగుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్ లు కిక్ ఇస్తాయి.

ఆఫ్ స్క్రీన్:

థ్రిల్లర్ సినిమాకి మూడ్ ని సెట్ చేసే డిపార్ట్ మెంట్స్ రెండు ఉంటాయి.. అవే సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్.. ఆర్.డి రాజశేఖర్ విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. అలాగే గోవింద్ వసంత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. వీరిద్దరూ కలిసి సినిమాలో కంటెంట్ లేకపోయినా వారి వారి బెస్ట్ వర్క్స్ తో ఎలివేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ పెద్దగా ఉపయోగం లేకపోయింది.

మైనస్ పాయింట్స్:

ఆన్ స్క్రీన్:

కార్తీకి సిస్టర్ గా సీనియర్ యాక్టర్ జ్యోతికని తీసుకున్నారు.. జ్యోతిక చాలా సీన్స్ లో ఉన్నప్పటికీ సరిగా వాడుకోలేదు, డైలాగ్స్ లేవు.. జ్యోతిక పాత్రని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకొని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఎందుకంటే ఇదొక ఫామిలీ థ్రిల్లర్.. థ్రిల్స్ తో పాటు ఎమోషనల్ టచ్ అనేది కూడా బలంగా ఉండాలి. కానీ ఇక్కడ అది మిస్ అయ్యింది. ఏ పరంగా ఈ ఫామిలీ ఎమోషన్స్ తో ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు అంత వీక్ గా ఫామిలీ సీన్స్ ని ఎగ్జిక్యూట్ చేశారు. అలాగే హీరోయిన్ గా చేసిన నిఖిల విమల్, షావుకారు జానకి పాత్రలకి కూడా పెద్ద ఉపయోగం ఉండదు. థ్రిల్లర్ అయినప్పటికీ చూసే ఆడియన్స్ ని ఎక్కడా సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూడాలి అనే ఫీలింగ్ ని అయితే కలిగించలేదు.

ఆఫ్ స్క్రీన్:

‘దృశ్యం’ ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ‘దొంగ’కి డైరెక్టర్. కథ పర,ముగా చూసుకుంటే సేమ్ టు సేమ్ ఆ ఫ్లేవర్ లోనే ఉంటుంది. కానీ అక్కడ కుటుంబ సభ్యుల భావోద్వేగాలను, వారి పెయిన్ ని మరియు థ్రిల్స్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేశారు. కానీ ఇక్కడ థ్రిల్స్ ఓకే అనిపించినా, ఎమోషనల్ హై ఇవ్వలేకపోయారు. అలాగే పలు కొరియన్ సినిమాలకి ఇన్స్పిరేషన్ లా క్లైమాక్స్ ఉంటుంది. అలాగే స్క్రీన్ ప్లే పరంగా కూడా చాలా బోరింగ్ గా రాసుకున్నారు. థ్రిల్లర్ అంటే ఆధ్యంతం ఏం జరుగుతుందా అనే ఆసక్తిని క్రియేట్ చేయాలి, కానీ ఇక్కడ చాలా ట్విస్ట్ లని, నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేది ఆడియన్స్ ఈజీగా చెప్పేయగలరు. అలాగే ఎమోషన్ ని గ్రిప్పింగ్ గా చెప్పలేకపోవడం వలన డైరెక్టర్ గా కూడా సక్సెస్ కాలేదు. విఎస్ వినాయక్ ఎడిటింగ్ కూడా సోసోగా ఉంది.

విశ్లేషణ:

‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కార్తీ – జ్యోతిక – సత్యరాజ్ ల కాంబినేషన్ లో ఒక ఫామిలీ థ్రిల్లర్ సినిమా, అది కూడా దృశ్యం లాంటి సినిమా తీసిన డైరెక్టర్ అంటే మళ్ళీ దృశ్యం రేంజ్ సినిమా చూడబోతాం అనే ఫీలింగ్ తో లోపలి వెళ్లిన ప్రేక్షకులు, కొన్ని థ్రిల్స్ కి వావ్ అనుకొని, కొన్ని సీన్స్ కి ఓకే ఓకే అనుకొని, ఫామిలీ ఎమోషన్స్ కి వచ్చేసరికి బాబోయ్ మరి ఇంత వీక్ గా ప్రెజంట్ చేసారేంటా అనే అసంతృప్తితో బయటకి వస్తారు. స్లో థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది, మిగతా వారు మాత్రం ఆ రేంజ్ లో సంతృప్తి చెందరు. కాంబినేషన్ ఉంటే సరిపోదు కంటెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే సినిమా నిలబడుతుంది అనే కోవలోకి ‘దొంగ’ కూడా చేరుతుంది.

ఫైనల్ పంచ్: దొంగ – ప్రేక్షకుల హృదయాల్ని దోచుకోలేకపోయాడు.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్ : 2/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...
నటీనటులు: కార్తీ, జ్యోతిక, సత్య రాజ్.. నిర్మాత: ఆర్.వి శ్రీనివాస్ దర్శకత్వం: జీతూ జోసెఫ్ సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్ మ్యూజిక్: గోవింద్ వసంత ఎడిటర్‌: విఎస్ వినాయక్ విడుదల తేదీ: డిసెంబర్ 20, 2019 'ఖైదీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ హీరో కార్తీ ఈ సారి తన వదిన జ్యోతిక కలిసి చేసిన ఎమోషనల్ థ్రిల్లర్ 'దొంగ'. 'దృశ్యం' ఒరిజినల్ మలయాళ వెర్షన్ డైరెక్టర్ జీతూ జోసెఫ్...కార్తీ 'దొంగ' మూవీ రివ్యూ