Switch to English

పవర్ ఆటలో పవార్ దే గెలుపు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎడతెగని సస్పెన్స్.. ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఊహాగానాలు.. వెరసి మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తెల్లవారుజాము సమయంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించి ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం.. ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం.. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. బుధవారం సాయంత్రం లోగా ఫడ్నవిస్ బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించడం.. తగినంత సంఖ్యా బలం లేక ముందుగానే ఫడ్నవిస్, అజిత్ పవార్ తమ పదవులకు రాజీనామా చేయడం.. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం కావడం.. ఇవీ ఈ మూడు రోజుల్లో జరిగిన పరిణామాలు.

ఈ మొత్తం ఆటలో నిజమైన గెలుపు ఎవరిదంటే.. అది నిస్సందేహంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దే. ఆయన ప్రధాని మోదీని కలవడం దగ్గర నుంచి మహా సీఎంగా ఉద్దవ్ ప్రమాణ స్వీకారం చేయడం వరకు పవార్ రాజకీయ చాణక్యం ముందు ఎంతో ఆరితేరిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా తల వంచక తప్పలేదు.

ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమితో తాము ఆటాడుకుంటున్నట్టు బీజేపీ భ్రమపడింది. కానీ అనూహ్యంగా పవార్ తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి మరింత అదిరిపోయే ట్విస్టుతో మహా ఉత్కంఠకు ముగింపు పలికారు. ఎన్సీపీ నుంచి తిరుగుబాటు నేతగా బయటకు వెళ్లిన అజిత్ పవార్ కు తిరిగి ఘన స్వాగతం లభించింది. ఆయనకే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.

రాష్ట్రపతి పాలన ఎత్తివేయించేందుకు శరద్ పవారే ఈ గేమ్ అంతా ఆడారా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ మొత్తం రాజకీయ క్రీడలో బీజేపీ భంగపడగా.. ఎన్సీపీ కాలర్ ఎగరేసింది. శివసేనకు సీఎం పదవి వచ్చినా.. అంతిమంగా పవార్ చెప్పిందే నడవనుంది.

మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. ‘‘భారత్ లో గతంలో ఎన్నడూ జరగని అతి గొప్ప ఎన్నికల ఫలితాలివి. ఫడ్నవిస్ మూడు రోజులే అయినా.. రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అందువల్ల ఆయన హ్యాపీ. అజిత్ పవార్ బీజేపీకి మద్దతిచ్చి, తనపై ఉన్న కేసులు తొలగిపోయేలా చూసుకున్నారు. అందువల్ల ఆయన హ్యాపీ. శివసేనకు సీఎం పీఠం దక్కింది. వారు కూడా హ్యపీ. కాంగ్రెస్ చేసిందేమీ లేదు.. కానీ ప్రభుత్వంలో ఉండే ఛాన్స్ కొట్టేసింది. కాబట్టి వారూ హ్యాపీనే.

నిజమైన కింగ్ మేకర్ పాత్ర పోషించి, ప్రభుత్వంలో పైచేయి సాధించి ఎన్సీపీ కూడా హ్యాపీనే. గవర్నర్ బీజేపీకే తొలి అవకాశం ఇచ్చి మోదీ, షా దృష్టిలో మంచి మార్కులు కొట్టేశారు. ఆయన కూడా హ్యాపీనే. ఉత్కంఠ గొలిపే పరిణామాలతో క్షణక్షణం బిజీగా గడిపిన మీడియా కూడా ఫుల్ హ్యాపీ. చివరకు బాలీవుడ్ సినిమాలో కూడా లేని ట్విస్టులతో మహారాష్ట్ర రాజకీయాలను ఆస్వాదించిన ఓటర్లు కూడా హ్యాపీనే’’ అంటూ ఉన్న ఈ పోస్టు వైరల్ గా మారింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....