Switch to English

టీఎస్సార్టీసీ దెబ్బ: వణుకుతున్న కేసీఆర్‌ సర్కార్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

నెల రోజుల ముందే సమ్మె నోటీసు ఇస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండ్‌ టీమ్‌ అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించింది.? ఈ చర్చ ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని ఆలోచింపజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వల్లే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్ళారన్న అభిప్రాయం చాలి గట్టిగా తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది. ‘సమ్మె ప్రభావం పెద్దగా లేదు..’ అని టీఆర్‌ఎస్‌ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతున్నా, ‘బస్సుల్ని భేషుగ్గా నడిపేస్తున్నాం.. సమస్య ఏమీ లేదు..’ అని తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి పువ్వాడ అజయ్‌ చెబుతున్నా.. వాస్తవం వేరేగా వుంది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె దెబ్బకి, తెలంగాణలో దసరా సెలవులు మరో వారం పొడిగింపబడ్డాయి. స్కూళ్ళు, కాలేజీలు తెరిస్తే.. తెలంగాణ ప్రభుత్వ బండారం బయటపడిపోతుంది. విద్యార్థులకు ఆర్టీసీ సమ్మె కారణంగా సమస్య తలెత్తితే.. ప్రభుత్వం కుదేలైపోవాల్సి వస్తుంది. అందుకే, సెలవులతో జనాన్ని మభ్యపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నది నిర్వివాదాంశం. సమ్మె ప్రభావం తెలంగాణపై లేనప్పుడు.. బస్సులు భేషుగ్గా నడుపుతున్నప్పుడు.. సెలవులు ఎందుకు ప్రభుత్వం ప్రకటించిందో మంత్రి పువ్వాడ అజయ్‌ తెలంగాణ ప్రజలకు సమాధానమివ్వాల్సి వుంది.

కొత్త బస్సులు కొనెయ్యాలి.. ఈ వారం రోజుల్లోగా ఆర్టీసీలో నియామకాలు జరిపెయ్యాలి.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు అయితే ఇచ్చేస్తున్నారుగానీ.. అంత తేలికైన వ్యవహారమా అది.? సకల జనుల సమ్మె పేరుతో తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌కి.. ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలిసి రావడం ఆహ్వానించదగ్గ విషయమే.

కానీ, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని కేసీఆర్‌ తెలుసుకోకపోతే ఎలా.? అక్టోబర్‌ 19న తెలంగాణ బంద్‌.. ఈలోగా రకరకాల నిరసన కార్యక్రమాలకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్షం తీర్మానించాయి. అంటే, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి కౌంట్‌డౌన్‌ షురూ అయినట్లేనా.?

4 COMMENTS

  1. 167465 157949Right after examine a couple of with the weblog posts on your internet website now, and I genuinely like your manner of blogging. I bookmarked it to my bookmark website record and will probably be checking back soon. Pls take a look at my internet page as effectively and let me know what you think. 138225

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...