Switch to English

Home సినిమా సంక్రాంతి కోడి పందానికి అల్లు అర్జున్‌ సిద్ధం!

సంక్రాంతి కోడి పందానికి అల్లు అర్జున్‌ సిద్ధం!

0
సంక్రాంతి కోడి పందానికి అల్లు అర్జున్‌ సిద్ధం!
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

సంక్రాంతి కోడి పందానికి అల్లు అర్జున్‌ సిద్ధం!

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో గతంలో ‘జులాయి’, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’ సినిమాలు చేసిన అల్లు అర్జున్‌, ఈసారి మరో సంచలనానికి సర్వాంగ సుందరంగా సిద్ధమవుతున్నాడు ‘అల వైకుంఠపురములో’ సినిమాతో. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని కన్‌ఫామ్‌ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్‌ ఆసక్తికరమైన పోస్టర్‌ని సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది.

సంక్రాంతి అంటే కోడి పందాలు.. దాన్ని ప్రతిబింబిస్తూ.. అల్లు అర్జున్‌ ఓ కోడి పుంజుతో నడిచి వస్తున్న ఫొటోని పోస్టర్‌లో పొందుపరిచారు. అల్లు అర్జున్‌ అంటేనే స్టైలిష్‌ స్టార్‌.. కోడి పుంజుతో అల్లు అర్జున్‌ మరింత స్టైలిష్‌గా కన్పించడమే కాదు, బీభత్సమైన మాస్‌ మిక్స్‌ చేసిన క్లాస్‌ లుక్‌లో కన్పిస్తున్నాడు. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పూజా హెగ్దేకి ఇటు అల్లు అర్జున్‌తోనూ, అటు త్రివిక్రమ్‌తోనూ రెండో సినిమా కావడం గమనార్హం.

మరోపక్క సంక్రాంతి పండక్కి మరో పెద్ద సినిమా రాబోతోంది. అదే ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్‌. కాగా, ‘వెంకీ మామ’ సినిమాని కూడా సంక్రాంతికి షిఫ్ట్‌ చేసే ఆలోచనల్లో వున్నారు. కళ్యాణ్‌రామ్‌ సినిమా ‘ఎంత మంచివాడవురా’ కూడా సంక్రాంతినే టార్గెట్‌ చేస్తోంది. సో, ఈ సంక్రాంతికి చాలా సినీ కోడి పుంజులు పందానికి సిద్ధమని అంటున్నాయన్నమాట.