Switch to English

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి అనేక సినిమాలకు సంభాషణలు రాసి ప్రేక్షకుల్ని మెప్పించారు. అయితే.. మాటలను ప్రాసలతో మలచి గులాబి మొక్క అంటుకట్టినట్టుగా మాటలు రాసి మాటల మాంత్రికుడు అనిపించుకున్నాడు. అతనే ‘త్రివిక్రమ్’. సినిమాకు మాటలు ఇలా కూడా రాయోచ్చా.. ప్రజల మనసులను సుతిమెత్తగా తాకేలా.. చెప్పాలనుకున్న భావాన్ని స్పష్టంగా చిన్న చిన్న వాక్యాలతో కూడా చెప్పొచ్చా.. పేజీలకు పేజీల డైలాగుల అర్ధాన్ని తక్కువ పదాలతో వివరించొచ్చని నిరూపించి, రచనకు సరికొత్త భాష్యమే చెప్పాడు త్రివిక్రమ్. నేటితో ఆయనలోని సినీ రచయితకు 25ఏళ్లు పూర్తయ్యాయి.

రచయితగా తనదైన మార్క్..

1999 సంవత్సరం కొత్త శతాబద్ధంలోకి వెళ్లే ముందు తెలుగు సినిమాకు కూడా కొంచెం అటు ఇటుగా కొత్త నీరొచ్చిన సంవత్సరం. ఇప్పుడున్న ఎందరో స్టార్ డైరక్టర్స్.. రైటర్స్.. నిర్మాతలు.. నటులు అప్పుడు వెలుగులోకి వచ్చినవారే. అలా వచ్చిన వ్యక్తే త్రివిక్రమ్. ఆ ఏడాది వచ్చిన ‘స్వయంవరం’తో రచయితగా తన మార్కు వేశాడు. తమ జీవితాలకు దగ్గరగా ఉండే విషయాలను తన మాటలతో చెప్పడం ప్రారంభమైన సినిమా. కొత్త తరహా ప్రేమకథకు కొత్త తరహా మాటలు. అప్పటివరకూ భావయుక్తమైన మాటలకు భిన్నంగా మన ఇంట్లో తరహా మాటలు. అవే త్రివిక్రమ్ ను స్టార్ రైటర్ చేశాయి. మన్మధుడులో.. అతని ప్రేమ సముద్రం.. జాలి వర్షం.. కోపం ప్రళయం వంటి డైలాగులు ఎన్నో. నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ ఇందుకు ఉదాహరణలు.

దర్శకుడిగా వండర్స్..

దర్శకుడిలో రచయిత కూడా ఉంటే ఎన్ని వండర్స్ క్రియేట్ చేయొచ్చో నిరూపించుకున్నవారిలో త్రివిక్రమ్ ఒకరు. తన మాటల ప్రవాహానికి దర్శకత్వం కూడా తోడైతే వచ్చిన వండర్స్.. నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా, అత్తారింటికి దారేది, అరవింద సమేత.. అల వైకుంఠపురములో సినిమాలే ఉదాహరణ. త్రివిక్రమ్ సినిమా అంటే ఫ్యామిలీ, ఫన్, మాటలు. త్రివిక్రమ్ సినిమాలో కొత్త తరహా మాటలు, పంచ్ లేకపోతే కూరలో ఉప్పు లేనట్టే. సినిమా చూస్తుంటే మనకే తెలియని ఓ నిస్సహాయత. అంతలా త్రివిక్రమ్ ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయారు. ఇటివలే గుంటూరు కారంతో వచ్చిన త్రివిక్రమ్ త్వరలో అల్లు అర్జున్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాతో రానున్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని వండర్స్ క్రియేట్ చేయాలని ఆల్ ది బెస్ట్ చెప్తోంది ‘టీమ్ తెలుగు బులెటిన్’.

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....