Switch to English

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ చేసింది. ప్రస్తుతం అందరి దృష్టి ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ల పైనే ఉంది. చార్జ్ తీసుకున్నప్పటినుంచి అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వీరిద్దరిని చుట్టుముడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు అధికార పార్టీ నేతలకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదులు వెళ్లాయి.

తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు లో ఎన్నికల కోడ్ కి విరుద్ధంగా వైసిపి శ్రేణులు మెప్మా ఆర్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని అడ్డుకున్న టిడిపి నేతలపై అధికార పార్టీ నేతలు దాడికి తెగబడ్డారు. అంతేకాకుండా వారిపై డ్రగ్స్ చల్లి చిత్ర హింసలు పెట్టారు. ఈ విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వివాదానికి దారితీసింది. వైసిపి నేతలపై నామ మాత్రపు కేసులు పెట్టి.. టిడిపి నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు. ఎన్నికల సమయంలో పోలీసుల తీరు ఇలాగే ఉంటే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూటమి పార్టీ నేతలు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

ఇక గత నెల 16న ఎన్నికల కోడ్ రావడంతోనే అందరి దృష్టి గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తే వాలంటీర్లపైనే పడింది. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు నియమించుకున్న వారు కాబట్టి ఎన్నికల కోడ్ సమయంలో వారు పనిచేయడానికి వీల్లేదని ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి వారిని తప్పించింది. ఏప్రిల్ నెలకి సంబంధించి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ లోనూ వారిని భాగస్వాములను చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ తంతును ప్రభుత్వం నడిపించింది.

అయితే ఇంటింటికి సచివాలయ ఉద్యోగులు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీల నేతలు కోరినప్పటికీ వారి అభ్యర్థనను సీఎస్ పక్కన పెట్టారు. వారికి ఎన్నికల విధులు ఉన్నందున ప్రజలే సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆర్డర్ కూడా పాస్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం పెద్ద కష్టమేమి కాదని అందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను కూడా ప్రతిపక్ష నేతలు సీఎస్ కి వివరించారు. అయితే, ఇంటికి పెన్షన్ తెచ్చి ఇవ్వాలంటే మళ్లీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్న సందేశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో జవహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శలు కూడా వచ్చాయి. వీటిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

బదిలీ వేటు పడే అధికారుల్లో బలంగా వినిపిస్తున్న మరో పేరు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతా రామాంజనేయులు. 2022లో చార్జ్ తీసుకున్న ఈయన.. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న అపవాదును మూట కట్టుకున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టులను ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఈయనపై బలంగా ఉన్నాయి. ప్రతిపక్ష నేతల కదలికలపై నిఘా ఉంచి ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారని ఇప్పటికి పలువురు ఆరోపిస్తున్నారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ముగ్గురి వివాదంపై స్పందించారు. వీరిపై వచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని, ఇందుకు సంబంధించిన రిపోర్టులను కూడా అందించామని, సీఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో వీరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...