Switch to English

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ రెండు లక్షల రూపాయల నజరానా అందిస్తారట.!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహించారు.. ఆ బస్సు యాత్రలో వైసీపీ క్యాడర్ పెద్దయెత్తున పాల్గొంది.. వందలాది మంది పోలీసులు, ఆ బస్సు యాత్రకు భద్రత కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ప్రోటోకాల్ వుంటుంది.

అయినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ‘రాయి దాడి’ జరిగింది. దాన్ని గులకరాయిగా కొందరు చెబుతున్నారు. ఇంకొందరేమో కంకర రాయి అంటున్నారు. వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఎయిర్ గన్ ఉపయోగించి దాడి చేశారంటున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందని వైసీపీ అను‘కుల’ మీడియా ఆరోపిస్తోంది. ఇంత పెద్ద ఘటన జరిగితే, పోలీసులు ‘సరైన సమాచారం ఇస్తే రెండు లక్షల బహుమతి’ అని ప్రకటించడాన్ని ఎలా చూడాలి.?

మామూలుగా అయితే, తమ కుటుంబ సభ్యులెవరైనా తప్పిపోతే, సమాచారం ఇచ్చినవారికి లక్ష రూపాయలో రెండు లక్షలో బహుమతి ప్రకటించడం.. ఈ తరహా ప్రకటనల్ని తరచూ చూస్తుంటాం.

ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగితే, సమాచారం ఇచ్చినవారికి రెండు లక్షల బహుమతిస్తామనడం కూడా అలాంటిదేనా.? సామాన్యులకంటే వేరే దారి వుండదు.. బహుమతులు ప్రకటిస్తారు. కానీ, పోలీస్ శాఖ అలా కాదు కదా.!

ఇంటెలిజెన్స్ విభాగం వుంటుంది, సీఐడీ వంటి విభాగాలుంటాయ్.. ఎక్కడో సోషల్ మీడియాలో ఎవరో ట్వీటేస్తే, రాత్రికి రాత్రి ఇళ్ళల్లోకి చొరబడి, అరెస్టులు చేసేస్తుంటారు కదా.? ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే, ఎవరో సామాన్యులు ఇచ్చే సమాచారం మీద ఆధారపడి నిందితుల్ని పట్టుకుంటారా.? అదసలు పద్ధతేనా.?

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పని తీరు ఎలా వుంది.? అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వుండాల్సింది. డ్రోన్ కెమెరాలు, వైసీపీ పార్టీ తరఫున వీడియో షూట్ చేసే వ్యక్తుల దగ్గర వుండే వీడియో ఫుటేజ్.. న్యూస్ ఛానళ్ళకు సంబంధించిన వీడియో ఫుటేజ్.. వైసీపీ క్యాడర్ దగ్గర వుండే వీడియోలు.. ఇవి కూడా క్యాప్చర్ చేయలేకపోయాయా ఆ ఘటనని.? నమ్మేలా వుందా ఇది అసలు.?

అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోందో రాష్ట్ర ప్రజలకు అర్థమవడంలేదు. ఇంత దయనీయ స్థితిలో వున్న పోలీసు శాఖని చూసి ప్రజలు ఆందోళన చెందాలో, ఆవేదన చెందాలో అర్థం కాని పరిస్థితి మరి.! ప్రజల రక్షణ రాష్ట్రంలో ‘గాల్లో దీపం’లా మారిపోయిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...