Switch to English

వైసీపీ వాలంటీర్లకే షాక్.! జగన్ చేసిన పాపమిది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

పాపం అనాలా.? నేరం అనాలా.? వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి, వారికి గౌరవ వేతనం పేరుతో, ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అబ్బే, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తరహాలో.. ఇది కూడా ఓ సంక్షేమ పథకం లాంటిదే.. యాభై ఇళ్ళకు ఓ వాలంటీర్ చొప్పున నియమించింది, ప్రజలకు సంక్షేమ పథకాలు మెరుగ్గా అందించడానికీ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి నేరుగా ప్రజలకు తెలియడానికీ.. అని వైసీపీ చెబుతోంది.

ప్రభుత్వానికి ‘ఉద్యోగులు’ అనే ఓ పెద్ద వ్యవస్థ వుంది. ప్రభుత్వం కోసం పనిచేసే ఉద్యోగులకు చట్టబద్ధత వుంది. వారికి ప్రతి నెలా వేతనాలు చెల్లిస్తోంది ప్రభుత్వం. ఇతరత్రా అలవెన్సులు వంటివి మామూలే. అలాంటప్పుడు, కొత్తగా ఈ వాలంటీర్ వ్యవస్థ దేనికి.? ఇదే మొదటి నుంచీ జనం మెదళ్ళలోనూ మెదులుతున్న ప్రశ్న.

ఓ వృద్ధుడు లేదా వృద్ధురాలికి వాలంటీర్ ప్రతి నెలా అందించే పెన్షన్ మొత్తం మూడు వేల రూపాయలు అనుకుందాం. మరి, వాలంటీర్‌కి నెల నెలా వచ్చేదెంత.? ఐదు వేలు. వీటికితోడు ఆమ్యామ్యాలు గట్టిగానే వాలంటీర్లకు దక్కుతున్నాయనీ, చిన్న చిన్న సెటిల్మెంట్లూ చేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు.

సరే, వాలంటీర్లంతా అలాంటోళ్ళేనని అనలేం. కానీ, ఆ వాలంటీర్ అనే ముసుగేసుకుని, అసాంఘీక శక్తులు కొన్ని చెలరేగిపోతున్నమాట వాస్తవం. వాటిని అదుపు చేయడానికి సరైన యంత్రాంగమే లేకుండా పోయింది. ‘వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలే’ అని వైసీపీ నేతలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ మధ్యనే ఆ మాట సెలవిచ్చారు.

వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలేనని ముఖ్యమంత్రి, మంత్రుల చెప్పకుండా వుండి వుంటే, ఈ రోజున వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా వుండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనకుండా ఆదేశాలు జారీ అయి వుండేవి కాదు. నిజానికి, వాలంటీర్ల గొంతు నొక్కిందీ, ఆ వ్యవస్థ మీద మచ్చ వేసిందీ అధికార వైసీపీనే.

రేప్పొద్దున్న ఏ ప్రభుత్వం వచ్చినా, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించొచ్చేమో… అది వేరే చర్చ. కానీ, వాలంటీర్ వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా వుండాల్సిందే. అదే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ద్వారా అర్థమవుతున్న విషయం.

వాలంటీర్లకు వైసీపీ ముసుగేయడం వైసీపీ నేతలు చేసిన అతి పెద్ద తప్పు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కూడా ఆ తప్పు చేశారు. తప్పు తమ దగ్గర పెట్టుకుని, విపక్షాల కుట్ర అనడం ఎంతవరకు సబబు.? గొడ్డలి వేటుని గుండె పోటుగా ఏమార్చే ప్రయత్నం చేసిన వైసీపీకి, ఇప్పుడీ వైసీపీ వాలంటీర్ల విషయంలో నేరాన్ని విపక్షాల మీదకు నెట్టేయడం పెద్ద కష్టమేమీ కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...