Switch to English

వైఎస్సార్సీపీ ‘ఫ్యాను’.. ‘అ’ గాలి మొదలైంది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రాజకీయం నుంచి అవినీతిని విడదీయగలమా.? అదసలు జరిగే ప్రసక్తే కాదు. తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని లక్షల కోట్లు దోచేశాడంటూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పరిపాలనలో అవినీతి వుండదంటే నమ్మేదెలా.? వైఎస్‌ జగన్‌ మాత్రం, తాను నీతివంతమైన పాలన అందిస్తానంటున్నారు.. అవినీతికి అసలు ఆస్కారమే వుండని పాలన అందించి తీరతానని శపథం చేస్తున్నారు.

అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా తాము అవినీతిని పెంచి పోషిస్తామని చెబుతుందా.? ఛాన్సే లేదు. తెరవెనుకాల చెయ్యాల్సిన పనులు చేసేస్తూ, పైకి మాత్రం.. జనాన్ని మభ్యపెట్టేందుకు ఏవేవో చెబుతుంటారన్నమాట. సో, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విషయంలోనూ ఇందుకు భిన్నంగా జరుగుతుందని ఏమాత్రం అనుకోవడానికి వీల్లేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఓ సీనియర్‌ మంత్రిగారి మీద అవినీతి ఆరోపణలు షురూ అయ్యాయి. పీఏ పేరు చెప్పి ఓ రేంజ్‌లో వెనకేసుకుంటున్నారట సదరు మంత్రి. పీఏని కలెక్షన్‌ సెంటర్‌గా మార్చేసిన వైనం గురించి సొంత పార్టీలోనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి కూడా వెళ్ళడంతో ఒకటికి రెండుసార్లు మందలించారట కూడా. ఆ మాటకొస్తే, పలువురు మంత్రుల విషయంలో ఇలాంటి ఆరోపణలు రావడంతో.. మంత్రి వర్గం కొలువుదీరిన పది పదిహేను రోజుల్లోనే, ‘పీఏల విషయంలో జాగ్రత్తగా వుండాలి..’ అంటూ ‘ఉమ్మడి హెచ్చరిక’ జారీ చేశారట వైఎస్‌ జగన్‌. కానీ, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదట. దాంతో, ఏ అవినీతి మరక అయితే అంటకూడదని వైఎస్‌ జగన్‌ అనుకుంటున్నారో.. ఆ మరక ఆల్రెడీ అంటేసిందంటూ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.

‘అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడటం తేలిక.. అవినీతి మరక అంటుకోకుండా వుండడం చాలా కష్టం..’ అన్నది అందరూ చెప్పే మాట. ఇసుక దందాలు అప్పుడే తారాస్థాయికి చేరి ఎంపీ – ఎమ్మెల్యే మధ్య రచ్చకు దారి తీశాయి. తాజాగా, గ్రామ వాలంటీర్ల ఎంపికలోనూ అధికార పార్టీ నేతల మధ్యనే ‘పంపకాల తేడాలు’ వచ్చాయంటూ గుసగుసలు విన్పిస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలకు తప్ప, ఇంకెవరికీ ఆ పోస్టులు దక్కడంలేదని ఆల్రెడీ విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలైతేనేం.. వారూ చేతి చమురు వదిలించుకుంటే తప్పద.. ఉద్యోగాలొచ్చే పరిస్థితి లేదట. అంటే, వైసీపీ ఫ్యానుకి ‘అవినీతి’ గాలి ఎక్కువేనన్నమాట.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...