Switch to English

‘మేడమ్‌ చీఫ్ మినిస్టర్‌’ ప్రారంభం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎస్‌.ఆర్‌.పి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తొలి చిత్రంగా రూపొందుతున్న ‘మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ శనివారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రేవతి క్లాప్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేవతిగారి మాటల్ని బట్టి చూస్తే సోసైటీకి సంబంధించిన చిత్రంగా అనిపించింది. 5 భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ఆడాలి’’ అని అన్నారు.

నటి దర్శకనిర్మాత రేవతి మాట్లాడుతూ..
బాగా చదువుకోవాలనే తపనలో అమెరికా వెళ్లా.. సక్సెస్‌ఫుల్‌ గా చదువు పూర్తి చేశా. ఎంబీఏ డాక్టరేట్‌ చేశా. అక్కడొక కంపెనీ ప్రారంభించా. అమెరికాలో ఉన్నా దేశాన్ని మాత్రం మరచిపోలేదు. అక్కడ నన్ను భరతమాత ముద్దు బిడ్డగా చూసేవారు. అక్కడ నన్ను గుర్తించడానికి కారణం మన దేశం. మన నడవడిక. మనం తల్లిదండ్రులు, గురువు, రుణం తీర్చుకుంటాం. సామాజిక రుణం అంటే దేశ రుణం మాత్రం మరచిపోతాం. దేశం కోసం ఏం చేద్దాం అనుకుంటున్న తరుణంలో చాలా ఆలోచనలున్నాయి. ఓ విలేజ్‌ని అడాప్ట్‌ చేసుకున్నా. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్‌ స్కూల్‌తో సమానంగా అభివృద్ధి చేశా. నా సంపదలో 20 శాతం సోసైటీ కోసం తీసేశా. ఇప్పటికి 5 గ్రామాలను దత్తత తీసుకున్నా. జనాల్లో మార్పు కోసం ఈ పని చేస్తున్నా. ఏడేళ్లగా నేను చేస్తున్న నా సేవలను గుర్తించి రాష్ట్రపతి నుంచి అవార్డు వచ్చింది. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జెడ్‌పి ఛైర్‌పర్స న్ శ్రీమతి సునీత మహేందర్‌ రెడ్డి ప్రొటోకాల్‌తో వచ్చి నన్ను సత్కరించారు. ప్రస్తుతం సమాజం ఉన్న పరిస్థితులను చూసి ఓ సినిమా ద్వారా ఆ పరిస్థితులను చెప్పాలనిపించింది. సినిమా అనేది సమాజంపై అత్యంత ప్రభావం చూపించే మీడియా. అందుకే మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌ సినిమా ప్రారంభించా. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఉంటుంది. యువతకు బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇది పొలిటికల్‌ సినిమా కాదు.. పబ్లిక్‌ మూవీ. ప్రపంచంలో ఇండియా అనేది చాలా గొప్పది అని చెప్పాలి. అదే నా గోల్‌. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...