Switch to English

Vrushabha Trailer: ‘వృషభ’ ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌ లాంఛ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Vrushabha Trailer: వి.కె.మూవీస్‌ పతాకంపై యుజిఓస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సగర్వ సమర్పణలో అశ్విన్‌ కామరాజ్‌ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘వృషభ’. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్‌, అలేఖ్య హీరో, హీరోయిన్‌లు.

బుధవారం ఫిలింఛాంబర్‌లో ఈ చిత్రం ట్రైలర్‌, పోస్టర్‌లాంచ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గౌతమ్‌రాజు తనయుడు హీరో కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సి. కల్యాణ్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.

అనంతరం సి. కల్యాణ్‌ మాట్లాడుతూ…

ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. దర్శక, నిర్మాతలు శివుణ్ణి నమ్ముకున్నారు. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆయన మిమ్మల్ని కరుణించి మీకు మంచి లాభాలు, పేరు తెచ్చిపెట్టాలి. ఈ సినిమాలో శివుడి పాత్ర చాలా ఉన్నట్టుగా ట్రైలర్‌ చూస్తే అనిపిస్తోంది. మంచి ఎమోషన్‌ ఉంది. చక్కటి లొకేషన్స్‌లో రిస్క్‌ అయినా లెక్కచేయకుండా చేసినట్లు ట్రైలర్‌ చూస్తే అర్ధమౌతోంది. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి భవిష్యత్తులో నిర్మాతగా, కథకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ…

ట్రైలర్‌ చాలా బాగుంది. ఇటీవల అఘోరాల కథతో వచ్చిన ‘అఖండ’ మూవీ ఎంత హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈసినిమా కూడా శివుడు, అఘోరాల బ్యాక్‌డ్రాప్‌లో మంచి కంటెంట్‌తో వస్తోంది. తప్పకుండా సక్సెస్‌ అవుతుందని నమ్ముతున్నాను. హీరో, హీరోయిన్‌ల నటన కూడా చాలా నేచురల్‌గా ఉంది. ఇవాళ పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి సమయంలో కూడా ‘వృషభ’ వంటి చిన్న సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇలాంటి చిన్న సినిమాలు కూడా పాన్‌ ఇండియా రేంజ్‌కు వెళతాయి. యూనిట్‌ అందరికీ ఆల్‌ది బెస్ట్‌ అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…

ట్రైలర్‌, టైటిల్‌ ప్రేక్షకులని థియేటర్‌కు రప్పిస్తాయి. ఆ రెండూ చిత్రానికి బాగా ప్లస్‌ అయ్యాయి. మంచి రా టైపు కంటెంట్‌తో నేచురల్‌గా ఉంది. ఈ ట్రైలర్‌ చూసిన ప్రేక్షకుడు తప్పకుండా మార్నింగ్‌షోకే థియేటర్‌కు వచ్చేస్తాడు. యూనిట్‌ అందరికీ మంచి సక్సెస్‌ ఇస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

ప్రముఖ నిర్మాత, సంతోషం అధినేత సురేష్‌ కొండేటి మాట్లాడుతూ..

ఈ టైటిల్‌ నాకు చెప్పగానే అద్భుతంగా ఉంది అన్నాను. కొన్ని సినిమాల ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌లు చూడగానే ఈ సినిమా సక్సెస్‌ అవుతుంది అని చెప్పేయవచ్చు. ఆ కోవకు చెందినదే ఈ సినిమా. తప్పకుండా ఇది మంచి పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

హీరో కృష్ణ (గౌతమ్‌రాజు తనయుడు) మాట్లాడుతూ…

మా దర్శకుడు కామరాజ్‌ గారు తనలోని ఆవేశం అంతా ఈ ట్రైలర్‌లో చూపించారు. అలాగే నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి గారు మంచి కథను అందించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతూ అందరికీ ఆల్‌ది బెస్ట్‌ అన్నారు.

చిత్ర హీరో జీవన్‌ మాట్లాడుతూ…

అందరం చాలా కష్టపడి చేశాం. ఇంకా క్లైమాక్స్‌ ఫైట్‌ చిత్రీకరించాల్సి ఉంది. ఈ చిన్న సినిమాను పెద్ద సినిమాగా భావించి ప్రమోట్‌ చేయాలని మీడియా మిత్రులను కోరుతున్నా అన్నారు.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ…

మంచి కంటెంట్‌తో, డిఫరెంట్‌ జోనర్‌ను టచ్‌ చేశాం. డివోషనల్‌గా వెళుతూనే పశువులకు, మనుషులకు మధ్య ఎంత బాండిరగ్‌ ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం చేశాం. ఈ సినిమా 1966`1990 మధ్య జరిగే కథ. యూనిట్‌ అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. ఈ ట్రైలర్‌ని అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమాలో ఇంకా అద్భుతాలు ఉన్నాయి అన్నారు.

నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి మాట్లాడుతూ…

ఓ మారుమూల పల్లెలోని ఒక చిన్న గుడిలో ఈ కథ నా మదిలో పుట్టింది. మూడు సంవత్సరాల పాటు దాన్ని డెవలప్‌ చేసుకుంటూ వచ్చాను. దాదాపు 70 శాతం షూటింగ్‌ అయిపోయింది. ఇంకా ఫైనల్‌ షెడ్యూల్‌ బ్యాలెన్స్‌ ఉంది. ఆగష్ట్‌లో అది కూడా పూర్తి చేస్తాం. మా హీరో జీవన్‌రెడ్డి అయితే చాలా సాహసాలే చేశారు ఈ సినిమా కోసం. మురళీమోహన్‌ గారు ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. అలేఖ్య కూడా చాలా బాగా చేసింది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...