Switch to English

అరెస్టు.! బెయిలు.! మంత్రి రోజా ఏం సాధించినట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తిరుపతి జనసేన ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా నమోదైన కేసులో ఆయన్ని అరెస్టు చేశారట పోలీసులు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని కిరణ్ రాయల్ భార్య ఆరోపించిన సంగతి తెలిసిందే.

కిరణ్ రాయల్‌కి జనసేన పార్టీ అండగా నిలిచింది. జనసేన పార్టీ లీగల్ విభాగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. తనను దుర్మార్గంగా అరెస్టు చేశారనీ, రాత్రిపూట పోలీసులు దౌర్జన్యంగా ఉగ్రవాది కంటే ఘోరంగా అరెస్టు చేశారనీ, తిరుపతి మొత్తం గంటన్నరపాటు తిప్పి.. నగిరికి తీసుకెళ్ళారనీ, ఓ కానిస్టేబుల్ ఫోన్ ద్వారా మంత్రి రోజా తనతో మాట్లాడారనీ, తనను దూషించినందుకే అరెస్టు చేసినట్లు చెప్పారని కిరణ్ రాయల్ వివరించారు.

కాగా, షరామామూలుగానే కిరణ్ రాయల్‌కి బెయిల్ లభించింది.. ఆయన బెయిల్ మీద నిన్న మధ్యాహ్నమే విడుదలయ్యారు. ‘నన్ను ఎలాగైతే అరెస్టు చేయించి, జైల్లో పెట్టించారో.. పద్ధెనిమిది నెలల్లో రోజాని కూడా అలాగే జైల్లో పెట్టిస్తా..’ అంటూ కిరణ్ రాయల్ మీడియా సాక్షిగా స్పష్టం చేశారు.

అయినా, అరెస్టయిన వ్యక్తితో పోలీసుల ఫోన్ల ద్వారా మంత్రి మాట్లాడటమేంటి.? రాజకీయాల్లో ఇదో దిక్కుమాలిన వ్యవహారం. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అరెస్టు జరిగినా, ఈ తరహా ఆరోపణ తెరపైకొస్తోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ తప్పలేదిది.

బాధితులు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసులు నమోదు చేయడం, అరెస్టు చేశాక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడం.. ఇదీ ప్రక్రియ.! కానీ, రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రీతిలో అరెస్టులు జరుగుతున్నాయి. కొన్నాళ్ళ క్రితం అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుల మధ్య తలెత్తిన రగడ.. ఈ క్రమంలో ఓ వర్గం అనుచరులు, ఇంకో వర్గానికి చెందిన అనుచరుడ్ని ఓ లాడ్జిలో కొట్టి, వీడియో కాల్ ద్వారా ఆ తతంగాన్ని తమ బాస్‌కి చూపించడమే కాదు, బాస్‌కి క్షమాపణ కూడా చెప్పించారు.

అక్కడ ఆ వీధి రౌడీలకీ, ఇక్కడ పోలీసు వ్యవస్థలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులకీ తేడా లేకపోతోందన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. జనసేన కావొచ్చు, టీడీపీ కావొచ్చు, బీజేపీ కావొచ్చు.. ఈ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్నవి తప్పుడు ఆరోపణలు అయితే, పోలీసు వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాల్సి వుంది.

లేదూ, కేవలం ప్రమోషన్ల కోసమో.. ఇతరత్రా ఆలోచనలతోనో అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా పోలీసులు ఆడుతున్నారంటే.. అది ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...