Switch to English

క్లాస్, మాస్ కాదు బాబాయ్.. కంటెంట్ ముఖ్యమంటోన్న ఆడియెన్స్!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద ఓ హీరో పుట్టుకొస్తాడని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. దాన్ని నిజం చేస్తూ, ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నాయి. అయితే సినిమాల విషయం ఎలా ఉన్నా, సగటు ప్రేక్షకుడి టేస్ట్ ఏమిటో ప్రస్తుతం పెద్ద మిస్టరీగా మారింది. ఒకప్పుడు ప్రేక్షకుడికి నచ్చే అంశాలు రెండే రెండు.. ఒకటి క్లాస్, రెండు మాస్.. కానీ, ప్రస్తుతం ఆ కామన్ ఆడియెన్స్‌కు ఏం నచ్చుతుందనే విషయంపై తలలు పట్టుకుంటున్నారు దిగ్గజ దర్శకనిర్మాతలు.

ఓ సినిమా సక్సెస్ కావాలంటే, దానికి ఆడియెన్స్ రెస్పాన్స్, సినిమా విశ్లేషకుల ప్రశంసలు తప్పనిసరి. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్నా.. సినిమాకు భజన చేసే రివ్యూవర్స్ ఉన్నా.. కలెక్షన్లు మాత్రం రావడం లేదు. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా మన టాలీవుడ్ బాక్సాఫీస్ నిలిచింది. గతకొంత కాలంగా టాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్న సినిమాల రిజల్ట్ చూస్తే మనకు ఈ అంశం స్పష్టం అవుతుంది.

స్టార్ హీరో, యంగ్ హీరో అనే తేడా లేకుండా ఎలాంటి సినిమాకైనా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. సినిమాలు బాగున్నాయని పబ్లిక్ అంటున్నారు.. రివ్యూలు కూడా బాగానే వస్తున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.. కానీ తమకు నష్టాలే మిగులుతున్నాయని నిర్మాతలు చెబుతున్నారు. కామన్ ఆడియెన్స్ పల్స్ ఏమిటనేది ఎవరికీ అర్థం కాని విధంగా మారింది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా రొటీన్ రొట్టకొట్టుడు కథలతో వస్తున్న సినిమాలను వారు నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసి పక్కనబెడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ ప్రభావం తరువాత సినిమా థియేటర్ కు వెళ్లి ఆడియెన్స్ సినిమాను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపడం లేదని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్, కేజీయఫ్-2 వంటి సినిమాలు భారీ వసూళ్లను రాబట్టడంలో సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలకు పబ్లిక్ టాక్, క్రిటిక్స్ రివ్యూలు కూడా చాలా వరకు హెల్ప్ అయ్యాయి. అయితే ఆ తరువాతే అసలు సమస్య మొదలైంది.

కొన్ని సినిమాలకు టాక్ నిజంగానే బాగున్నా.. కలెక్షన్లు మాత్రం రావడం లేదు. ఈ జాబితాలో నాని హీరోగా నటించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ’ పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తుంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ టాక్ వచ్చినా, ఓవర్సీస్‌లో మాత్రం అదిరిపోయే టాక్ వచ్చింది. కానీ ఫైనల్‌గా కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. ఇక రీమేక్ సినిమాలకు సైతం ఇదే పరిస్థితి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా రీమేక్ చేసిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు కూడా పబ్లిక్ టాక్ బాగుంది. ఈ సినిమాకు రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. కానీ టోటల్ రన్‌లో ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

కానీ సినిమాల్లో కంటెంట్ బాగున్నా, పబ్లిక్ టాక్ పాజిటివ్ గా ఉన్నా, రివ్యూలు కూడా బాగా వచ్చినా.. కలెక్షన్లు మాత్రం వెలవెలబోతున్నాయి. ఈ జాబితాలో స్వాతిముత్యం, గాడ్ ఫాదర్, ఊర్వశివో రాక్షసివో చిత్రాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే ప్రేక్షకుడు సినిమాను వీక్షించే కోణం మారిందా.. ఆడియెన్స్‌కు సినిమాల టేస్ట్ తెలియడం లేదా అనే ప్రశ్నకు ఏమాత్రం అవకాశం లేదు. ఇటీవల రిలీజ్ అయిన కన్నడ మూవీ ‘కాంతార’కు భాషాభేదం లేకుండా ప్రేక్షకులు పట్టం కడుతున్న తీరు చూస్తే వారి టేస్ట్ ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది. సినిమాలో ఆకట్టుకునే అంశం ఉంటే ప్రేక్షకులు ఎప్పటికీ సినిమాలను ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. మరి తెలుగు సినిమాలకు ఇలాంటి రెస్పాన్స్ ఇటీవల ఎందుకు రావడం లేదని పలువురు విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.

సినిమాలో క్లాస్, మాస్ అంశాలు కాదు బాబాయ్.. అసలైన కంటెంట్ పట్టుకురండి.. సినిమాకు పట్టం కడతాం.. కేవలం రాజమౌళి, త్రివిక్రమ్‌లే కాదు.. కొత్త ట్యాలెంట్‌ను కూడా నెత్తిన పెట్టుకునేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ రెడీ అంటున్నారు. మరి మన తెలుగు సినిమా మేధావులకు ఈ అంశం ఎప్పటికి అర్థం అవుతుందో.. వారు తమకు నచ్చే సినిమాలు కాకుండా, ప్రేక్షకులు మెచ్చే సినిమాలను ఎప్పుడు పట్టుకొస్తారా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...