Switch to English

రాయుడికి అన్యాయం.. ఇది కోహ్లీ కుట్రే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మన తెలుగోడు అంబటి తిరుపతి రాయుడు.. వరల్డ్‌ కప్‌లో సత్తా చాటాలనుకున్నాడు.. ఇండియన్‌ ప్రీమియర్‌లో సత్తా చాటినా, ఎందుకో సెలక్టర్లు అంబటి రాయుడి విషయంలో సానుకూలంగా స్పందించలేకపోయారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌ విభాగాల్లో రాయుడి కంటే విజయ్‌ శంకర్‌ మెరుగ్గా ఆడగలడంటూ సెల్టర్లు చెప్పినా, మాజీ క్రికెటర్లు మాత్రం అంబటి రాయుడికి జరిగిన అన్యాయంపై గట్టిగానే గళం విప్పారు.

ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయం పాలవడంతో, రిషబ్‌ పంత్‌ని రంగంలోకి దించారుగానీ, అంబటి రాయుడిని మాత్రం పిలవలేదు. ఇప్పుడు విజయ్‌ శంకర్‌ కూడా గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. ఇప్పుడూ అంబటి రాయుడికి అన్యాయమే జరిగింది. మయాంక్‌ అగర్వాల్‌ని విజయ్‌ శంకర్‌ స్థానంలో తీసుకొస్తున్నారు. నిజానికి, అంబటి రాయుడు బ్యాటింగ్‌ పరంగా ఫుల్‌ ఫామ్‌లో వున్నాడు. అవకాశమొస్తే మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడగల అంబటి రాయుడిని కాదని, వరల్డ్‌ కప్‌ పోటీల్లో టీమిండియా ప్రయోగాలు చేస్తుండడం గమనార్హం.

నాలుగేళ్ళకోసారి జరిగే వరల్డ్‌ కప్‌ కోసం ముందస్తుగా ప్రయోగాలు చేయడం సహజమేగానీ, వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ జరుగుతున్నప్పుడు ఈ ప్రయోగాలేంటే, కెప్టెన్‌ కోహ్లీకీ, సెలక్టర్లకీ, బీసీసీఐకే తెలియాలి. నిన్నటి ఇంగ్లాండ్‌ – టీమిండియా మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ ఇన్నింగ్స్‌ చూసిన అంబటి రాయుడు అభిమానులకి ఒళ్ళు మండిపోయింది. ‘అదే అంబటి రాయుడు క్రీజ్‌లో వుండి వుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించేది’ అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కెప్టెన్‌ కోహ్లీ మీద సెటైర్లు వేస్తున్నారు.

ఇంతకీ, విరాట్‌ కోహ్లీ ఎందుకు అంబటి రాయుడు మీద సీత కన్నేసినట్లు.? తెలుగోడు అయి వుండీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌, ఎందుకు అంబటి రాయుడిని చిన్న చూపు చూస్తున్నట్లు.? ఇలాంటి సందర్భాల్లో రీజినల్‌ సెంటిమెంట్స్‌ ప్రస్తావన సబబు కాదేమోగానీ, ఆ ఫీలింగ్‌ ఏదో గట్టిగా ప్రభావం చూపడం వల్లే అంబటి రాయుడికి అవకాశాలు రావడంలేదన్న అనుమానమైతే బలపడుతోంది.

నిజానికి, అంబటి రాయుడికి అవమానాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. మొదటినుంచీ అతనిపై సెలక్టర్లు చిన్న చూపే ప్రదర్శిస్తున్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సందర్భంగా సచిన్‌ ప్రోత్సహించి వుండకపోతే, అంబటి రాయుడిని ఇలా కూడా చూసి వుండేవాళ్ళం కాదేమో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...