Switch to English

మెగా కాంపౌండ్ పనైపోయిందా.? వాళ్ళకేమన్నా మతి పోయిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

బుర్ర తక్కువ సన్నాసులు.! ఔను, లేకపోతే ఏంటి.? నూట యాభై సినిమాలకు పైగా చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఒకే ఒక్క సినిమా ‘ఆచార్య’తో డీలా పడతారా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? మెగాస్టార్ చిరంజీవి కావొచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావొచ్చు, మెగా కాంపౌండ్‌లో ఇంకో హీరో ఎవరైనా కావొచ్చు.! ఆ మాటకొస్తే, సినీ పరిశ్రమలో ఎవరినైనా కావొచ్చు.. ఒక్క సినిమాతో ‘పనైపోయింది’ అనడం అవివేకం.!

‘నువ్వసలు సినిమాలకే పనికి రావు..’ అని చిరంజీవి మొహమ్మీదే కెరీర్ మొదట్లో కొందరు అన్నారట. అలాగని, చిరంజీవి అక్కడితో జర్నీ ఆపెయ్యలేదు కదా.? హీరో గోపీచంద్ హీరోగా ఫెయిలయి, విలన్ వేషాలు వేసి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలానే కనిపిస్తాయ్ తెలుగు సినీ పరిశ్రమలో.

‘ఆచార్య’ ఫ్లాప్.. ‘గని’ ఫ్లాప్.. ‘రంగ రంగ వైభవంగా’ కూడా ఫ్లాప్.. సో, మెగా కాంపౌండ్ పనైపోయింది. ఇదీ, కొందరు మూర్ఖుల వాదన. పవన్ కళ్యాణ్ పాత సినిమా ‘జల్సా’ మళ్ళీ విడుదల చేస్తే, రికార్డులు బద్దలైపోయాయ్.! ఓ స్టార్ హీరో స్టామినా ఏంటన్నది ప్రతిసారీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త సినిమా వచ్చిన ప్రతిసారీ, ఆ రేంజ్ కనిపిస్తుంటుంది.

ఫలానా హీరో పనైపోతే, దర్శకులైనా నిర్మాతలైనా అటువైపు చూడరు. కానీ, మెగా కాంపౌండ్‌లో హీరోలెవరూ ఇప్పుడు ఖాళీగా లేరు.. ఒక్క అల్లు శిరీష్ తప్ప.! అబ్బే, అల్లు శిరీష్ మెగా కాంపౌండ్ కాదనే ‘పిచ్చ లాజిక్కులు’ లాగితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

సోకాల్డ్ చెత్త మీడియా, మెగా కాంపౌండ్ మీద వార్తలు రాయడం మానేస్తే (నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా) అప్పుడు కాస్త అనుమానపడాలి.. మెగా కాంపౌండ్ పనైపోయిందేమోనని.! అంతేగానీ, నిత్యం మెగా కాంపౌండ్ మీద పడి ఏడిస్తే తప్ప తమ కడుపు నిండదని సదరు చెత్త మీడియా అదే పనిలో బిజీగా వున్నంత కాలం.. మెగా కాంపౌండ్‌కి తిరుగు లేదనే కదా అర్థం.?

మెగా కాంపౌండ్ మీద పడి ఏడిస్తే తప్ప తమకు గతి లేదనే దుస్థితిలో సోకాల్డ్ మీడియా వుందంటే.. అదీ మెగా కాంపౌండ్ ఘనత.! అలాంటోళ్ళకి కూడా పరోక్షంగా మెగా కాంపౌండ్ తిండి పెడుతోందన్నమాటే కదా.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...