Switch to English

అనసూయ “జబర్దస్త్‌” కెరీర్‌ లో ఇంట్రెస్టింగ్‌ మలుపులు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జబర్దస్త్‌ కు ముందు అనసూయ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమె ఒకటి రెండు సినిమాల్లో నటించింది. టీవీ ఛానల్ లో వర్క్ చేసింది. తెలుగు అమ్మాయి కాకున్నా కూడా హైదరాబాద్‌ లో సెటిల్ అయ్యి ఇక్కడే కెరీర్ ను ఎంపిక చేసుకుంది.

ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరలను దున్నేస్తున్న అనసూయ గురించి ఇప్పుడు చూద్దాం. మే 15వ తారీకు 1985 లో పుట్టిన అనసూయ భరద్వాజ్ స్కూల్‌ వయసులోనే ప్రేమలో పడ్డట్లుగా పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది. ఆమె తన కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. భరద్వాజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిన అనసూయ ఆ తర్వాత కెరీర్‌ లో టాప్ పొజీషన్ కు వెళ్లింది.

జబర్దస్త్‌ ప్రారంభం అయిన సమయంలో ఎంతో మంది అమ్మాయిలను.. అప్పటికే యాంకర్స్ గా ఉన్న వారిని మల్లెమాల వారు పరిశీలించారు.. సంప్రదించారు. కాని అనూహ్యంగా అదృష్టం అనసూయకు వచ్చిందట. అలా వచ్చిన అవకాశం ఆమె స్థాయిని పెంచేసింది. మద్యలో కొంత సమయం దూరం ఉన్నా కూడా సుదీర్ఘ కాలంగా జబర్దస్త్‌ తో ఈమె అనుబందం కొనసాగింది.

అనసూయ “జబర్దస్త్‌” కెరీర్‌ లో ఇంట్రెస్టింగ్‌ మలుపులు..

జబర్దస్త్‌ అనగానే అనసూయ అనేంతగా పాపులారిటీని దక్కించుకుంది. జబర్దస్త్‌ ఎపిసోడ్ ప్రారంభం సమయంలో అనసూయ వేసే డాన్స్ కోసం షో ను చూసే వారు ఎంతో మంది ఉంటారు. ఒక వేళ టీవీలో మిస్ అయితే యూట్యూబ్‌ లో అయినా ఆమె ఇంట్రో సాంగ్‌ ను చూసే అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతగా జబర్దస్త్‌ ఇంట్రో సాంగ్‌ కు పేరు తీసుకు వచ్చి.. షో కు ఒక మంచి టేకాఫ్‌ ను ఇచ్చే అనసూయ జబర్దస్త్‌ షో సక్సెస్ లో మెజార్టీ రోల్‌ ను పోషిస్తూ వచ్చింది అనడంలో సందేహం లేదు. కానీ ఇటీవలే ఈమె జబర్దస్త్ కు గుడ్‌ బై చెప్పేసింది. సినిమాలతో బిజీగా ఉండటం తో పాటు స్టార్‌ మా లో ఎక్కువ పారితోషికం ఇస్తూ ఉండటం వల్ల ఆమె అటుగా వెళ్లినట్లుగా తెలుస్తోంది.

పెళ్లి అయ్యింది.. పిల్లలు అయ్యారు ఇప్పుడు నేను ఏం చేస్తాను.. ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారు అనే భావన ఆమెకు రాకుండా తాను ఎంచుకున్న కెరీర్ లో ముందడుగు వేసింది. అలా కుటుంబ బాధ్యతలు ఉన్నా.. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఏమాత్రం ఆమె తన కెరీర్‌ కు ఎఫెక్ట్‌ కాకుండా మ్యానేజ్ చేసుకుని లక్షలాది మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది. అనసూయ భరద్వాజ్ సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఆమె హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్నా కూడా తన ఇమేజ్ కు తగ్గట్లుగా.. వయసుకు తగ్గట్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరియు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తుంది.

అనసూయ “జబర్దస్త్‌” కెరీర్‌ లో ఇంట్రెస్టింగ్‌ మలుపులు..

హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్‌ సినిమా లకు ఓకే చెప్పాలని ఆమె భావిస్తుంది. స్టార్‌ హీరోల సినిమా ల్లో కీలక పాత్రలకు ఈమెకు ఛాన్స్ వస్తుంది. మోస్ట్‌ వాంటెడ్‌ అన్నట్లుగా ఈ అమ్మడి కెరీర్ కొనసాగుతోంది. సుకుమార్‌ రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్రలో చూపించిన తర్వాత ఈమెను అలాంటి పాత్రలకు ఎక్కువ శాతం మంది అడుగుతున్నారు.

పుష్ప లో కూడా చాలా కీలక పాత్రలో అనసూయ కనిపించి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకుంది. మొత్తానికి అనసూయ ప్రస్తుతం టాలీవుడ్‌ లో బిజీ నటిగా కొనసాగుతూనే బుల్లి తెరపై సుమ తర్వాత అంతటి పాపులారిటీని దక్కించుకున్న యాంకర్ గా దూసుకు పోతుంది. ఒకే సారి రెండు పడవల ప్రయాణం ప్రమాదం అంటారు. కాని అనసూయ విషయంలో అలా ఏం లేదని ఆమె కెరీర్‌ జర్నీ చూస్తే అర్థం అవుతుంది.

నటిగా అనసూయ ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం. నటిగా.. యాంకర్ గా ఇంత బిజీగా ఉన్నా కూడా ఆమె కుటుంబంకు సమయం కేటాయించడం మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్ గా హాలీడే ట్రిప్స్‌ తో పాటు ఏదో ఒక వేడుక కుటుంబ సభ్యులతో అనసూయ జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే బుల్లి తెర స్టార్స్ మరియు ఇతర అమ్మాయిలు అంతా కూడా అనసూయ ను ఆదర్శంగా తీసుకోవచ్చు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...