Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్; చిరంజీవికి మదర్ సెంటిమెంట్ తో బ్లాక్ బస్టర్.. ‘రాక్షసుడు’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

సినిమాలు తీసేందుకు కొన్ని ఫార్ములాలు ఉంటాయి. యాక్షన్, థ్రిల్లర్, ప్రేమ, ఫ్యామిలీ డ్రామా.. ఇలా కొన్ని ఫార్ములాలతోనే ఏ కథైనా సినిమాగా తెరకెక్కుతుంది. ఇందులో తల్లి సెంటిమెంట్ ఒకటి. హీరో-తల్లి సెంటిమెంట్ తో ఎన్నో హిట్స్ ఉన్నాయి. చిరంజీవి హీరోగా వచ్చిన సినిమాల్లో కూడా తల్లి సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్లు అయిన సినిమాలు ఉన్నాయి. వీటిలో ప్రముఖమైంది ‘రాక్షసుడు’. యాక్షన్, మదర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సహజంగానే చిరంజీవి యాక్షన్ కు భారీ క్రేజ్. దీంతోపాటు సినిమాలో తల్లి సెంటిమెంట్ ప్రేక్షకులను మెప్పించింది. సెంటిమెంట్ సీన్లలో చిరంజీవి నటన మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరంజీవి స్టైల్, డ్రెస్సింగ్, డ్యాన్సులు, ఫైట్లు స్పెషల్ గా నిలిచాయి.

తల్లి సెంటిమెంట్..

‘రాక్షసుడు’ అనే టైటిల్ లోనే సినిమాకు సంబంధించిన అర్ధం ఉంటుంది. తనతోపాటు మరికొందరిని బాల కార్మికులుగా ఓ దీవికి తీసుకెళ్లి కొన్నేళ్లపాటు బయటి ప్రపంచానికి తెలీకుండా ఉంచడంతో విలన్ల పట్ల రాక్షసుడు అవుతారు చిరంజీవి. తల్లికి దూరమై.. ఆమె కోసం వెతికే ప్రయత్నంలో తనకు అడ్డుపడేవారి పట్ల రాక్షసంగానే వ్యవహరిస్తారు చిరంజీవి. ఇన్ని షేడ్స్ తో తెరకెక్కిన సినిమా చిరంజీవి ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకుల్ని కూడా కట్టి పడేసింది. తన తల్లి గురించి చెప్పిన సందర్భంలో.. ఆమె తన తల్లి కాదు అని విలన్ చెప్పిన సందర్భంలో రెండు విధాలుగా చిరంజీవి నటన అద్భుతమనే చెప్పాలి. ఇక్కడ సెంటిమెంట్ పండుతుంది. తాను దీవిలో ఉన్నప్పుడు ఓ మహిళ మోజు పడిన సందర్భంలో.. తల్లి ప్రేమ గురించి వివరించే సన్నివేశం చిరంజీవి ఆ పాత్రలో జీవించారని చెప్పాలి.

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్; చిరంజీవికి మదర్ సెంటిమెంట్ తో బ్లాక్ బస్టర్.. ‘రాక్షసుడు’

పాటల మ్యాజిక్కు..

సినిమాకు మరో మేజర్ ఎస్సెట్ ఇళయరాజా సంగీతం. అద్భుతమైన బాణీలతో వీనులవిందైన పాటలు అందించారు. వీటిని మరింత అందంగా చిరంజీవి మాయాజాలమే చేశారు. పాటల్లో చిరంజీవి స్టైల్, ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్, డ్యాన్సులు పాటలను మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ‘అచా.. అచ్చా.. బచా.. బచ్చా..’ అనే పాట సినిమాకే హైలైట్. భవనం చుట్టూ తిరుగుతూ ఆ పాటలో చిరంజీవి చేసిన స్టైలిష్ డ్యాన్సులు, ఎక్స్ ప్రెషన్స్ కు ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. చిరంజీవి సరసన రాధ, సుహాసిని హీరోయిన్లుగా నటించారు. పాటల్లో చిరంజీవి-రాథ మధ్య కెమిస్ట్రీ మరోసారి మ్యాజిక్కే చేసింది. మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లోకి ఎంట్రీ ఈ సినిమా ద్వారానే ఇచ్చారు.

హ్యాట్రిక్ హిట్లు..

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్. రామారావు ఈ సినిమా నిర్మించారు. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ నవల రాక్షసుడు ఆధారంగా అదే టైటిల్ తో చిరంజీవికి లక్కీ డైరక్టర్ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సినిమా తెరకెక్కించారు. అప్పటికే అభిలాష, చాలెంజ్ సినిమాలతో వరుస హిట్లు ఇచ్చిన ఈ కాంబినేషన్ రాక్షసుడుతో హ్యాట్రిక్ సాధించారు. 1986 అక్టోబర్ 2న విడుదలైన రాక్షసుడు ఘన విజయం సాధించింది. 26 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా చిరంజీవిని మరో మెట్టు ఎక్కించింది. రజినీకాంత్ ముఖ్య అతిధిగా చెన్నైలో శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...