Switch to English

మెగా స్టార్ బర్త్ డే స్పెషల్స్ : ‘ప్రాణం ఖరీదు’తో తెలుగు సినిమాకు తన విలువెంతో చెప్పిన చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది. నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఆయన ప్రస్థానం అటు పాత తరం సినిమాకు.. నేటి తరం సినిమాకు వారధిగా నిలుస్తోంది. మెగాస్టార్ గా ఆయన దక్కించుకున్న కీర్తి, ప్రేక్షకుల నీరాజనాలు, అభిమానుల కేరింతలు అంత తేలిగ్గా దక్కలేదు. నటుడిగా తెలుగు తెరకు పరిచయమై ఇప్పటికి 152 సినిమాల్లో నటించి.. మెప్పించారు. ఆయన సినీ ప్రస్థానం తొలి సినిమా ‘పునాదిరాళ్లు’తో మొదలైంది. అయితే.. మొదటగా విడుదలైన సినిమా మాత్రం ‘ప్రాణం ఖరీదు’.

తొలి సినిమాలోనే ప్రముఖులతో..

ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధి నుంచి నటుడిగా చిరంజీవికి వచ్చిన తొలి అవకాశం ‘పునాదిరాళ్లు’. కానీ.. ఆ తర్వాత ప్రారంభమైన ‘ప్రాణం ఖరీదు’ సినిమా మొదట విడుదలైంది. ‘పునాదిరాళ్లు’ సినిమాకు 1978 ఫిబ్రవరి 11న తొలిసారి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చినా అదే ఏడాది సెప్టెంబర్ 22న తొలి సినిమాగా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది. అప్పటికే సినిమాల్లో ప్రముఖులుగా ఉన్న చంద్రమోహన్, జయసుధ, రావుగోపాలరావు, నూతన్ ప్రసాద్, చలం.. వంటి వారితోపాటు చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు. రేష్మరాయ్ హీరోయిన్ గా నటించింది. పాలేరు నరసింహా పాత్రలో.. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ శిక్షణలో నేర్చుకున్న మెళుకువలతో తన పాత్రకు తగ్గ రీతిలో నటించారు చిరంజీవి. పేదవారిని తక్కువగా చూసే మోతుబరిని ఎదిరించే పాత్ర.

చిరంజీవి: ‘ప్రాణం ఖరీదు’తో తెలుగు సినీ పరిశ్రమకు తన విలువెంతో చెప్పిన

 

కధగా చెప్పాలంటే..

దేవుడు (చంద్రమోహన్) చెల్లెలు బంగారి (రేష్మ రాయ్)ను నరసింహ (చిరంజీవి) ప్రేమిస్తాడు. వీరు పాలేరుగా మోతుబరి కనకయ్య (రావుగోపాలరావు), సీత (జయసుధ) ఇంట్లో పని చేస్తారు. వీరి ఇంటికి సీత (జయసుధ) సోదరుడు బంగారం (చలం) వస్తాడు. అక్క ఇంట్లో పని చేసే బంగారిపై కన్ను వేస్తాడు. ఓరోజు బంగారిపై అఘాయిత్యానికి పాల్పడతాడు. అప్పటికే యాజమాన్య వ్యవస్థపై కనకయ్యను ఎదిరించి పట్నంలో పనికి వెళతాడు నరసింహ. పని చూసుకుని తిరిగొచ్చే సమయానికి బంగారి అన్యాయానికి గురవుతుంది. మరోవైపు దేవుడు, తన భార్య సీత అక్రమ సంబంధంలో ఉన్నారని భావించి కనకయ్య వీరిద్దరినీ చంపేస్తాడు. దీంతో కోపోద్రిక్తుడైన చిరంజీవి, గ్రామస్థులంతా కలిసి కనకయ్యను హతమారుస్తారు.

పరిశ్రమ దృష్టిని ఆకర్షించి..

క్రాంతికుమార్ నిర్మాతగా శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ ప్రైజెస్ నిర్మాణంలో కె.వాసు దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. 23 ఏళ్ల వయసులో చిరంజీవి నటన, ఆయన డైలాగులు పలికే తీరు, యుక్త వయసులో నటనను సినిమాలో స్పష్టంగా చూడొచ్చు. ఆవేశంతో చెప్పే డైలాగులు.. అందుకు తగ్గ నటనతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. సినిమాలో చిరంజీవి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. హీరోగా మాత్రమే కాకుండా వచ్చిన పాత్రలను సద్వినియోగం చేసుకునే క్రమంలో చేసిన నరసింహా పాత్ర ఆయనకు విమర్శకుల నుంచి కూడా పేరు తెచ్చిపెట్టింది. మంచి విజయంతో ‘ప్రాణం ఖరీదు’ చిరంజీవికి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. చక్రవర్తి సినిమాకు సంగీతం అందించారు. సీఎస్ రావు కథ, మాటలు అందించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...