Switch to English

విజయసాయిరెడ్డికి ఢిల్లీ పెద్దల వార్నింగ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పేరుకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అయినా, విజయసాయి రెడ్డి వాలకం చూస్తే, ఆయన భారతీయ జనతా పార్టీ భావజాలం నరనరాన జీర్ణించుకుపోయినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టే క్రమంలో బీజేపీకి చాలా దగ్గరైపోయారు ఈ రెడ్డిగారు. తెలుగుదేశం పార్టీ నుండి, సీఎం రమేష్‌ని బీజేపీలోకి తీసుకెళ్లడంలో విజయసాయి రెడ్డి పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ కష్టమేదో, వైఎస్సార్‌సీపీ కోసం పడినా బాగుండేదనీ, వైసీపీ ముఖ్య నేత ఒకరు తనకు అత్యంత సన్నిహితుడైన ఓ మీడియా ప్రతినిధి వద్ద తన ఆవేదనను వెళ్లగక్కేసుకున్నారు.

నిజమే, విజయసాయి రెడ్డి, బీజేపీతో అంటకాగుతున్నారన్న దాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఒకవేళ బీజేపీకీ, వైఎస్సార్‌సీపీకీ మధ్యన అనుకోని స్పర్ధలొస్తే, తాను తెలివిగా బీజేపీలోకి జంప్‌ చేసేయాలని విజయ్‌ సాయి రెడ్డి చూస్తున్నారేమో. ఇదిలా ఉంటే, బీజేపీలోకి టీడీపీ ఎంపీలు జంప్‌ చేయడం వెనక పెద్ద కుట్ర ఉందనీ, ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమనీ, విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు, బీజేపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయట.

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఢిల్లీ స్థాయి బీజేపీ నేత ఒకరు ఈ విషయమై విజయ సాయి రెడ్డికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘వాళ్లిప్పుడు బీజేపీ ఎంపీలు.. అదుపు తప్పి వారిపై వ్యాఖ్యలు చేస్తే కౌంటర్‌ గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది.. ‘ అని సదరు బీజేపీ నేత విజయ సాయి రెడ్డికి క్లాసు తీసుకున్నారట. చేసేది లేక విజయ సాయి రెడ్డి మిన్నకుండి పోయారట. అయినా, సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌లతో కలిసి సరదాగా డిన్నర్‌ చేసిన విజయ సాయి రెడ్డి వాళ్లని కోవర్టులుగా చిత్రీకరించడమేంటీ.?

నరేంద్రమోడీ కాస్త చనువిస్తున్న మాట వాస్తవం. చంద్రబాబుకు గతంలో మోడీ ఓ రేంజ్‌లో చనువిచ్చారు. ఆ తర్వాత ఏమైందో అందరం చూశాం. విజయ సాయి రెడ్డి కాస్తంత అతి తగ్గించుకోకపోతే, ఇటు వైఎస్సార్‌సీపీకీ, అటు బీజేపీకీ దూరమయ్యే పరిస్థితి రావచ్చు. ఆయనేమీ ప్రజాబలం ఉన్న నాయకుడు కాదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వైఎస్‌ జగన్‌ విజయ సాయి రెడ్డికి పార్టీలో అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేపీ విషయంలో తోక జాడిస్తే, సుజనా చౌదరి బెదిరినట్లు, విజయసాయి రెడ్డి లొంగిపోవడం పెద్ద విషయమేమీ కాదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...