Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 08 మే 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:36
సూర్యాస్తమయం: సా.6:22
తిథి: వైశాఖ శుద్ధ సప్తమి మ.12:50 వరకు తదుపరి వైశాఖ శుద్ధ అష్టమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: పుష్యమి ఉ.11:22 వరకు తదుపరి ఆశ్లేష
యోగం: గండ సా.5:15 వరకు తదుపరి వృద్ధి
కరణం: వనిజ మ.12:40 వరకు తదుపరి విష్టి
వర్జ్యం: రా.1:11 నుండి 2:53 వరకు
దుర్ముహూర్తం: సా.4:25 నుండి 5:13 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:23 నుండి సా.4:59 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:14 నుండి తె.5:02 వరకు
అమృతఘడియలు: ఉ.6:23 నుండి 8:08 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:48నుండి మ.12:38వరకు

ఈరోజు (08-05-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతో ధన విషయంలో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుపడి పెరుగుతుంది. సోదర వర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.

మిథునం: మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ఋణ ఒత్తిడి తొలగడానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట అందరితో మాటలు పడవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: సమాజంలో పెద్దల ఆదరణ లభిస్తుంది. దూర ప్రయాణములు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

సింహం: ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులు కొన్ని వ్యవహారాలలో మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్య: చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారంతో ఊరట చెందుతారు. వ్యాపారాలలో అనుకోకుండా లాభాలు అందుతాయి.

తుల: ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలలో శుభవార్తలు అందుతాయి. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు అంచనాలు అందుకుంటారు.

వృశ్చికం: కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ విషయంలో లోటు పాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి.

ధనస్సు: అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. మీ మాటలు కుటుంబ సభ్యులకు నచ్చవు. నిరుద్యోగులు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

మకరం: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయట పడతారు.

కుంభం: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు రాజీ అవుతాయి. వ్యాపారమున స్థిరమైన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

మీనం: చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు సతమతం చేస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యటం మంచిది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున తగిన గుర్తింపు ఉండదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...