Switch to English

కాలయముడు: వాలంటీరూ.. టీడీపీ నాయకుడూ.. ఏది నిజం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తూర్పుగోదావరి జిల్లాలో జీలుగు కల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రంలో పెను సంచలనానికి కారణమయ్యింది. ఈ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళతో అక్రమ సంబంధం ఈ దారుణానికి కారణంగా పోలీసులు తేల్చారు. సదరు కాలయముడు ఏ పార్టీకి చెందినవాడన్నదానిపై ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.

నిందితుడు రాంబాబుని పోలీసులు అరెస్టు చేయగా, అతను తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామ సచివాలయ వాలంటీరు వంతల రాంబాబు అని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా అంటోంది. మరోపక్క, వంతల రాంబాబుని టీడీపీ నాయకుడిగా వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చిత్రీకరిస్తోంది.

ఇంతకీ ఏది నిజం.? ‘వాలంటీర్ పోస్టులన్నిటినీ వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాం..’ అని కొన్నాళ్ళ క్రితం వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించుకోవడం అప్పట్లో వివాదాస్పదమైన విషయం విదితమే.

ఆ లెక్కన, వంతల రాంబాబు అనే వాలంటీరు వైసీపీకి చెందిన వ్యక్తి అనుకోవాలేమో. లేదూ, వైసీపీ ఆరోపిస్తున్నట్టు వంతల రాంబాబు, టీడీపీ నేత అయి వుంటే, వైసీపీ – టీడీపీ మధ్య తెరవెనుక ‘అవగాహన’లో భాగంగానే, టీడీపీ రాజకీయ నిరుద్యోగులకు వైసీపీ హయాంలో ‘కీలక అవకాశాలు’ దక్కుతున్నాయని అనుకోవాలేమో.

సరే, దుర్మార్గులు ఏ పార్టీలో అయినా వుండొచ్చు. అలాంటివారిపై ఆయా పార్టీలు సందర్భానుసారం చర్యలు తీసుకోవడమనేది సర్వసాధారణమైన విషయం. నేరం బయటపడ్డాక కూడా, ఈ రాజకీయాలేంటి.? కీలక పదవుల్లో వున్నవారే, కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు.. కింది స్థాయి కార్యకర్తలపై నేరాభియోగాలు, దాని చుట్టూ రాజకీయమంటే, నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టే అనిపిస్తుంటుంది రాజకీయ నాయకుల్ని చూశాక.

ఒక్కటి మాత్రం నిజం.. వాలంటీర్లపై చాలా చాలా అనుమానాలు, వివాదాలున్నాయి. ఎప్పటికప్పుడు వాలంటీర్ల అఘాయిత్యాలపై వార్తలొస్తునన దరిమిలా, వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం వుంది. కానీ, వాలంటీర్లలో మెజార్టీ వైసీపీ కార్యకర్తలే గనుక ప్రక్షాళన జరిగేందుకు ఆస్కారమే లేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...