Switch to English

ప్రత్యేక హోదా వీళ్ళు అడిగేస్తారట.? వాళ్ళు ఇచ్చేస్తారా మరి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రత్యేక హోదా డిమాండ్ విషయమై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైసీపీ అంటోంది. అరరె, వెనక్కి తగ్గరు సరే.. ముందుకు వెళతారా.? వెళ్ళరా.? అన్న ప్రశ్నకైతే సమాధానం చెప్పరుగాక చెప్పరు. ఎందుకంటే, ముందుకు వెళ్ళే ఉద్దేశ్యం లేదు గనుక.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాం.. అంటూ ఎన్నికల వేళ, అంతకు ముందు వైసీపీ అధినాయకత్వం పలికిన ప్రగల్భాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వావ్, ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ప్రత్యేక హోదా తెచ్చేస్తారేమోనని గుడ్డిగా నమ్మేసిన ఓటర్లు, వైసీపీకి అధికారం కట్టబెట్టారు.

అంతే, అధికార పీఠమెక్కేదాకా పులులు.. అధికార పీఠమెక్కాక పిల్లులైపోయాయి. ప్రత్యేక హోదా కోసం గతంలో ఎంపీలు రాజీనామాలు చేశారు. మరి, ఇప్పుడో.. ‘రాజీనామాలు చేస్తే ఏమొస్తది.?’ అంటూ అమాయకంగా ప్రశ్నించేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తిరుపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక హోదా వ్యవహారం ఘాటెక్కింది.

ఆగండాగండి.. ఘాటెక్కడమంటే, జనం ఉద్యమిస్తున్నారనో.. రాజకీయ పార్టీలు ఉద్యమిస్తున్నాయనో.. అధికార వైసీపీ, గట్టిగా కేంద్రాన్ని నిలదీసేస్తోందనో కాదు. దీన్నొక రాజకీయ పరమైన అంశాన్ని చేసి, తద్వారా రాజకీయ పబ్లిసిటీ పొందడానికి అధికార వైసీపీ ‘గుంట నక్క తెలివితేటలు’ ప్రదర్శించడంతోనే ఈ మాత్రం ఘాటైనా ఎక్కింది.

‘మేం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు..’ అని కుండబద్దలుగొట్టేస్తోంది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్. ‘ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు..’ అని చెప్పి మరీ, తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసింద బీజేపీ. బీజేపీ గెలవలేదుగానీ, చెప్పుకోదగ్గ ఓట్లయితే వచ్చాయ్. ఆ సమయంలోనే వైసీపీ, బీజేపీని నిలదీసి వుంటే.. సీన్ ఇంకోలా వుండేదేమో.

ఇప్పుడు అదే తిరుపతి వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర హోం మంత్రి దృష్టికి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకెళతారట. దృష్టికి తీసుకెళితే పనులు జరుగుతాయా.? నిలదీస్తే పనులు జరుగుతాయా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...