Switch to English

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయారు.

ఇదంతా వైఎస్ జగన్ స్వయంకృతాపరాదం. 2019 ఎన్నికల సమయంలో, అంతకు ముందు.. అటు విజయమ్మనీ, ఇటు షర్మిలనీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు వైఎస్ జగన్. అధికారంలోకి రాగానే, తల్లినీ, చెల్లినీ.. పార్టీ నుంచి దూరంగా నెట్టేశారు.

పైగా, జనంలోకి వెళ్ళి, ‘మీ బిడ్డ ఒంటరి’ అంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే, చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టేందుకు గడచిన ఐదేళ్ళుగా వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఆ ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి.

మొన్నీమధ్యనే చిరంజీవి, తన సోదరుడు పవన్ కళ్యాణ్‌కి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు.. జనసేన పార్టీ తరఫున కౌలు రైతులకు చేస్తున్న సాయం నిమిత్తం. తాజాగా, ‘కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవాలి..’ అని ఆకాంక్షిస్తూ ఓ వీడియో విడుదల చేశారు చిరంజీవి.

‘అకారణంగా రాజకీయాల్లో పడకూడని మాటలు పడుతున్నాడు నా తమ్ముడు..’ అంటూ చిరంజీవి, ఈ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘జనమే జయం..’ అంటూ పవన్ కళ్యాణ్ గెలుపుని ఆకాంక్షించారు చిరంజీవి ఈ వీడియోలో.

నిజానికి, చిరంజీవి ఈ వీడియోలో ఎవర్నీ విమర్శించింది లేదు. తోడబుట్టిన తమ్ముడికి మాట సాయం చేశారంతే.! తమ కుటుంబ సభ్యుడు రాజకీయంగా ఎదగాలని కోరుకోవడం తప్పెలా అవుతుంది.? కానీ, వైసీపీ మాత్రం, చిరంజీవి పెద్ద నేరం చేశాడన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా పస లేని వాదనల్ని తెరపైకి తెస్తోంది.

చిరంజీవితోపాటు, మరో సినీ నటుడు నాని కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్దతు పలికాడు. ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ సైతం, జనసేనాని విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నిర్మాత నాగవంశీ, జనసేనాని గెలుపును ఆకాంక్షిస్తూ పిఠాపురం వెళ్ళారు.

ఇదిలా వుంటే, సినీ పరిశ్రమ తరఫున మరికొంతమంది ప్రముఖులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నిలిచేందుకు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అందరిపైనా, వైసీపీ మార్కు ట్రోలింగ్ అయితే నిస్సిగ్గుగా షురూ అయ్యింది.

ఇదిలా వుంటే, తమ్ముడి గెలుపుని కాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి, పిఠాపురం వెళతారనే ప్రచారం జరుగుతున్నా, ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. అన్నట్టు, రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో చిరంజీవి వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....